E-Paper
Advertisement

జననాయగన్ లీక్…విజయ్ కు అండగా నిలిచిన యంగ్ హీరో.. మౌనం వహిస్తున్న కోలీవుడ్?

జననాయగన్ లీక్…విజయ్ కు అండగా నిలిచిన యంగ్ హీరో.. మౌనం వహిస్తున్న కోలీవుడ్?
Advertisement

Jananayagan: విజయ్ హీరోగా నటించిన జననాయగన్ సినిమా తరచు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాని సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అందుకు అనుకూలంగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అయితే ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెన్సార్ సర్టిఫికెట్ రాని నేపథ్యంలో చివరి నిమిషంలో వాయిదా పడింది ఇప్పటివరకు ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.

జననాయగన్ లీక్.. ఖండించిన శివ కార్తికేయన్..

ఇలా తరచూ ఈ సినిమా వాయిదా పడటమే కాకుండా తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని సన్నివేశాలు లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇలా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఒక స్టార్ హీరో సినిమా విడుదలకు ముందే లీక్ అవ్వడం పట్ల ఒక్కసారిగా ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా విజయ్ సినిమా లీక్ కావడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ కాస్త మౌనంగా ఉన్నారనే చెప్పాలి. ఈ విషయంపై మొట్టమొదటిగా నటుడు శివ కార్తికేయన్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇలా శివ కార్తికేయన్ స్పందించడంతో తదుపరి ఒక్కొక్కరు జననాయగన్ సినిమా లీక్ అవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

సినీ పరిశ్రమను గౌరవించండి..

Advertisement

నటుడు శివ కార్తికేయన్ ఈ సినిమా లీక్ కావడంతో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రతి సినిమా వందలాది మంది అభిరుచి, రక్తంతో, చెమటోడ్చి రూపొందుతుంది. దయచేసి సినిమాల పైరసీకి దూరంగా ఉండండి. థియేటర్లలో విడుదల అయ్యేవరకు కాస్త ఎదురుచూసి సినిమాలను థియేటర్లలోనే చూడండి. ఇలా పైరసీకి బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇతరుల ప్రతిభను గౌరవించండి, కష్టాన్ని గౌరవించండి, సినీ పరిశ్రమను గౌరవించండి అంటూ శివ కార్తికేయన్ ఈ సందర్భంగా జన నాయగన్ లీక్ అవ్వడం గురించి తన మద్దతును తెలియజేస్తూ పోస్ట్ చేశారు.

Advertisement

ఈ విధంగా శివ కార్తికేయన్ మొదటగా ఈ విషయంపై స్పందించడంతో తదుపరి ప్రముఖ సంగీత దర్శకులు జీవి ప్రకాష్, విజయ్ ఆంటోనీ వంటి తదితరులు కూడా ఈ సినిమా లీక్ అవ్వడాన్ని ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు అయితే ఇప్పటివరకు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు మాత్రం ఈ విషయంపై మౌనం వహించడం గమనార్హం. ఇక విజయ్ జననాయగన్ సినిమా రాజకీయ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక విజయ్ సైతం రాజకీయాలలోకి వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా విడుదల కాకుండా రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఉద్దేశపూర్వకంగానే తన సినిమాని తొక్కేస్తున్నారు అంటూ విజయ్ ఈ సినిమా వాయిదాపై స్పందించిన సంగతి తెలిసిందే.

Also Read: దిమ్మ తిరిగే రేంజ్ లో రాకా బడ్జెట్.. బన్నీ రెమ్యూనరేషన్ ఎంతంటే?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×