E-Paper
Advertisement

భర్త నల్లగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి భార్య దారుణం

భర్త నల్లగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి భార్య దారుణం
Advertisement

Dhar Crime: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. నూరేళ్లూ తోడుంటానని చెప్పిన భార్యే, కాలయముడై భర్త ప్రాణాలు తీయడం పెళ్లి అనే బంధానికే మచ్చతెచ్చింది. కేవలం భర్త రంగు తక్కువని, తన అందానికి అతను సరిపోడని ఓ మహిళ చేసిన ఘాతుకం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

ప్రియాంక అనే మహిళకు తన భర్త రూపం నచ్చలేదు. ‘నువ్వు నల్లగా ఉన్నావు, నా రేంజ్‌కు సరిపోవు’ అంటూ నిత్యం అతనితో గొడవపడేది. ఈ క్రమంలోనే ఆమెకు కమలేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తన సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ప్రియాంక, ప్రియుడితో కలిసి అతడిని వదిలించుకోవాలని స్కెచ్ వేసింది. ఇందుకోసం ఏకంగా ఒక లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి మరీ కిరాతకానికి ఒడిగట్టింది.

Advertisement

ప్రియుడు, అతని స్నేహితుడి సహాయంతో భర్తను అతి దారుణంగా హత్య చేయించింది. అయితే, తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె పెద్ద డ్రామానే ఆడింది. ఇంట్లోకి దొంగలు పడ్డారని, వారే దోపిడీ చేసి తన భర్తను చంపేశారని నమ్మించే ప్రయత్నం చేసింది. కళ్ళముందే భర్త ప్రాణాలు పోతుంటే ఏమీ తెలియనట్టు నటించింది.

పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేయడంతో ప్రియాంక అసలు రంగు బయటపడింది. ఆమె ఫోన్ కాల్స్, ప్రవర్తనపై అనుమానం వచ్చి నిలదీయగా.. తానే తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించింది. అందం, అక్రమ సంబంధం అనే వ్యామోహంలో పడి, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఈ కిరాతకులను చూసి స్థానికులు విస్తుపోతున్నారు. కేవలం రంగును సాకుగా చూపి హత్య చేయడం ఆమెలోని క్రూరత్వానికి పరాకాష్ట.

Advertisement

Also Read: మంత్రి పొన్నం ప్రభాకర్ బంపర్ ఆఫర్.. ఇకపై వారికి కూడా ఉపాధి గ్యారంటీ!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×