E-Paper
Advertisement

Nani Paradise Movie : నాని సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..?

Nani Paradise Movie :  నాని సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..?
Advertisement

Nani Paradise Movie : టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది పారడైజ్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘దసరా’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే…

నాని తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం ‘ది పారడైజ్’. 1980వ దశకంలో సికింద్రాబాద్ మురికివాడల నేపథ్యంలో సాగే ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా కోసం నాని ఫ్యాన్స్ కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

Advertisement

జాన్వీ కపూర్ ఎందుకు రిజెక్ట్ చేసింది?
ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట అతిలోక సుందరి శ్రీదేవి తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ను చిత్ర బృందం సంప్రదించిందట. నాని సరసన జాన్వీ అంటే ఆ క్రేజ్ వేరే లెవల్‌లో ఉంటుందని మేకర్స్ భావించారు. కానీ, జాన్వీ కపూర్ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి కారణం మరేదో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’. రామ్ చరణ్ కెరీర్‌లో 16వ సినిమాగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమా డేట్స్, నాని సినిమా డేట్స్ క్లాష్ అవ్వడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో జాన్వీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని సమాచారం. జాన్వీ కాదనడంతో, చిత్ర బృందం ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాలెంటెడ్ బ్యూటీ కాయదు లోహర్ హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్టు సమాచారం.

Advertisement

నాని డబుల్ రోల్.. 8 భాషల్లో రిలీజ్
హీరోయిన్ ఎవరైనా నాని మార్క్ పర్ఫార్మెన్స్ చూడాలని ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాని రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని వస్తున్న వార్తలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ‘దసరా’లో ధరణిగా ఊర మాస్ లుక్‌లో అలరించిన నాని, ఈసారి సికింద్రాబాద్ బాబుగా ఎలా కనిపిస్తారో చూడాలి. దాదాపు 8 భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో మార్చి 26, 2026న ఈ పారడైజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

Big Stories

Advertisement
×