E-Paper
Advertisement

Adventure Thriller OTT : భర్త కోసం బిక్కుబిక్కుమంటూ ప్రయాణం… అర్దరాత్రి ఒంటరిగా డ్రైవర్ చేతికి చిక్కడంతో ట్విస్ట్… మస్ట్ వాచ్

Adventure Thriller OTT : భర్త కోసం బిక్కుబిక్కుమంటూ ప్రయాణం… అర్దరాత్రి ఒంటరిగా డ్రైవర్ చేతికి చిక్కడంతో ట్విస్ట్… మస్ట్ వాచ్
Advertisement

Adventure Thriller OTT : రియలిస్టిక్ యాక్టింగ్ కి నవాజుద్దీన్ సిద్దీకీ మారు పేరుగా చెప్పుకోవచ్చు. ఈ హీరో నటించిన ఒక మూవీ ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్ళింది. నవాజుద్దీన్ నటనకి ప్రశంసలు కూడా వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఉండే ఒక మారుమూల విలేజ్ నుంచి ఢిల్లీ వరకు ఒక యువతి తన భర్తను వెతకడం చుట్టూ తిరుగుతుంది.  ఇది సండాన్స్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి భారీ అక్లైమ్ అందుకుంది. ఇండియా అధికారిక ఆస్కార్ ఎంట్రీగా సెలెక్ట్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2013లో వచ్చిన ఈ హిందీ రోడ్ డ్రామా సినిమా పేరు ‘లయర్స్ డైస్’ (Liar’s Dice). ఇది మలయాళ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ మొదటి హిందీ చిత్రం. ఇందులో గీతాంజలి తాపా, నవాజుద్దీన్ సిద్దీకీ లీడ్ రోల్స్‌లో నటించారు. 61వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఆక్ట్రెస్ (గీతాంజలి తాపా), బెస్ట్ సినిమాటోగ్రఫీ (రాజీవ్ రవి) గెలిచింది. 87వ ఆస్కార్స్‌కు ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ ఇచ్చింది. గీతాంజలి తాపా & నవాజుద్దీన్ సిద్దీకీ పర్ఫార్మెన్సెస్, రియలిస్టిక్ స్టోరీటెల్లింగ్, అద్భుతమైన హిమాలయ విజువల్స్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా Netflix లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : గ్రహాంతర అంతరిక్ష నౌక శిథిలాల వల్ల మిస్టీరియస్ జబ్బులు… మైండ్ బెండింగ్ సై-ఫై థ్రిల్లర్

కథలోకి వెళ్తే

హిమాచల్ ప్రదేశ్‌లోని టిబెట్ సరిహద్దులో ఉన్న ఒక గ్రామంలో ఈ కథ ప్రారంభమవుతుంది. కమల (గీతాంజలి థాపా) అనే యువతి తన భర్త పని కోసం ఢిల్లీ వెళ్లి ఐదు నెలలైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతుంది. గ్రామస్తులు ఆమెను వారించినా, తన చిన్న కుమార్తె మన్య, పెంపుడు మేకపిల్లతో కలిసి తన భర్తను వెతకడానికి ఢిల్లీకి ప్రయాణమవుతుంది. కొండ ప్రాంతాల నుండి సాగే ఈ ప్రయాణం చాలా కష్టతరంగా ఉంటుంది. దారిలో వీళ్ళకి నవాజ్(నవాజుద్దీన్ సిద్ధిఖీ) అనే సైన్యంలో పని చేసి మానేసిన ఒక అపరిచితుడు పరిచయమవుతాడు. మొదట్లో కమల అతడిని నమ్మదు. కానీ ఒక ఒంటరి మహిళ, చిన్న పాపకు ఈ ప్రయాణం క్షేమకరం కాదని భావించి, డబ్బు కోసం అతను వారికి తోడుగా ఉంటానని ఆఫర్ చేస్తాడు. కమల అయిష్టంగానే దీనికి అంగీకరిస్తుంది. వీరిద్దరి మధ్య సాగే ప్రయాణం, ఒకరినొకరు నమ్మీ నమ్మనట్టుగా ఉండే పరిస్థితులు, ఢిల్లీ వంటి నగరంలోని మనుషుల ప్రవర్తనను ఈ సినిమా చాలా వాస్తవికంగా చూపిస్తుంది. చివరికి వీళ్ళు ఢిల్లీ చేరుకున్నాక, అక్కడ పనిచేసే కార్మికుల దుస్థితి, కమల భర్తకు ఏమైందనే నిఖార్సైన నిజం బయటపడుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుంది.

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×