E-Paper
Advertisement

Uppal Balu – Janhvi Kapoor: షాక్ అయ్యారా… ఉప్పల్ బాలు డ్యాన్స్‌ వీడియోను షేర్ చేసిన జాన్వీ కపూర్

Uppal Balu – Janhvi Kapoor: షాక్ అయ్యారా… ఉప్పల్ బాలు డ్యాన్స్‌ వీడియోను షేర్ చేసిన జాన్వీ కపూర్
Advertisement

Uppal Balu – Janhvi Kapoor: ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా చికిరి..చికిరి(Chikiri Chikiri) పాట వినపడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా(Peddi Movie) నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా విడుదలైన చికిరి సాంగ్ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఇక ఈ పాటలో రామ్ చరణ్ హుక్ స్టెప్స్ కు విపరీతమైన ఆదరణ లభించడమే కాకుండా ఎంతోమంది రి క్రియేట్ చేస్తూ రీల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎన్నో రీల్స్ చక్కర్లు కొడుతున్నాయి సెలబ్రిటీల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ రాంచరణ్ హుక్ స్టెప్స్ రిక్రియేట్ చేస్తున్నారు.

ఉప్పల్ బాలు డాన్స్ పై జాన్వీ రియాక్షన్..

ఈ క్రమంలోనే ఉప్పల్ బాలు(Uppal Balu) సైతం చికిరి.. చికిరి పాటకు తనదైన స్టైల్ లోనే స్టెప్పులు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే .అయితే ఈ వీడియో కాస్త జాన్వి కపూర్ (Janhvi Kapoor)దృష్టికి వెళ్లడంతో ఆమె ఏకంగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ డాన్స్ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా ఉప్పల్ బాలు ఏకంగా చీర కట్టుకొని నడిరోడ్డుపై కూర్చొని రామ్ చరణ్ హుక్స్ స్టెప్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతూ జాన్వీ దృష్టిలో పడటంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఉప్పల్ బాలు హుక్ స్టెప్స్ మీరు కూడా చూసేయండి.

ట్రెండింగ్ లో చికిరి.. చికిరి..

Advertisement

ఇక పెద్ద సినిమా విషయానికి వస్తే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా గ్రామీణ క్రీడ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే దాదాపు 60% పైగా షూటింగ్ పూర్తి అయిందని తెలుస్తుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చ్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ చికిరి పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

?igsh=NWgwZDUybWp0dm1w

Advertisement

ఇక ఈ పాటకు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇలా ఫస్ట్ సింగిల్ సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో చిత్ర బృందం సెకండ్ సింగిల్ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ పాటను కూడా డిసెంబర్ 31వ తేదీ విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పూర్తిగా అభిమానులను నిరాశపరచడంతో మెగా అభిమానులు పెద్ది సినిమా పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే రామ్ చరణ్ మంచి సక్సెస్ అందుకోబోతున్నారని తెలుస్తుంది.

Also Read: Manchu Lakshmi: మోహన్ బాబు కూతురు కూడా క్యాస్టింగ్ బాధితురాలే… నిద్రలేని రాత్రులంటూ

Related News

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

Big Stories

Advertisement
×