Janhvi Earnings: జాన్వి కపూర్ ..అచ్చియమ్మగా పెద్ది సినిమాలో చరణ్ కి జోడీగా నటించిన ఈ బాలీవుడ్ బ్యూటీ కేవలం గ్లామర్ డాల్ గానే మిగిలిపోకుండా తనకంటూ స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటుంది.అవును… జాన్వి బ్యూటీ కేవలం కెమెరా ముందే కాకుండా సోషల్ మీడియాలో సత్తా చాటుతూ కాసుల వర్షంలో మునిగి తేలుతుంది.ఇ న్స్టా గ్రామ్ లో 2.67 కోట్లపైగా ఉన్న ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ వాటిని వాడుకుంటున్న తీరుకు బిజినెస్ వర్గాలు షాక్ అవుతున్నాయట .ఒకరకంగా చెప్పాలంటే జాన్వి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి అడ్రస్ గా మారిపోయాయని టాక్.ఆమె ప్రొఫైల్ నుంచి వచ్చే ఒకే ఒక పోస్ట్ లేదా క్రియేటివ్ రీల్ వెనుక లక్షల రూపాయల బిజినెస్ నడుస్తుందట .
ఏడాదికి ఒక కోటి నుంచి 2.5 కోట్ల వరకు
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇ న్స్టా గ్రామ్ లో ఒక ప్రమోషన్ కి ఈ అమ్మడు ఏకంగా ఏడు లక్షల నుంచి 10 లక్షల వరకు చార్జ్ చేస్తుందట .ఇక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసే పోస్టులకి కూడా లక్షల్లోనే డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.కేవలం సింగిల్ పోస్టులతోనే కాగిపోకుండా ఒప్పో మొబైల్స్, లెన్స్‌కార్ట్, లగ్జరీ ట్రావెల్ బ్రాండ్ తుమి,హావెల్స్ వంటి టాప్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు జాన్వి బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి తెలిసిందే.ఇలా టోటల్ బల్క్ ప్యాకేజీల ద్వారా ఏడాదికి ఒక కోటి నుంచి 2.5 కోట్ల వరకు ఈ అమ్మడి అకౌంట్లో వచ్చి పడుతుందని తెలుస్తుంది.
also read:లెనిన్ కోసం డ్రాగన్ .. బాక్సాఫీస్ లెక్కలు మారతాయా ?
నెలకి ఏకంగా 1.5 కోట్లకు పైగానే
ఇక ప్రతి నెల కనీసం డజన్ కి పైగా డిఫరెంట్ డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్ తో జాన్వి తన సోషల్ మీడియా అకౌంట్ ని నింపేస్తున్న సంగతి తెలిసిందే .అలా ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారానే నెలకి ఏకంగా 1.5 కోట్లకు పైగానే సంపాదిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు .మొత్తానికి ప్రస్తుతం ఉన్న ఈ బాలీవుడ్ యంగ్ జనరేషన్ లో జాన్వీ కున్న కమర్షియల్ వ్యాల్యూ, డిజిటల్ క్రేజ్ మరొకరికి లేదనడంలో సందేహం లేదు.ఇక వీటిని సంగతి పక్కన పెడితే సినిమాల్లో నటించడానికి జాన్వి ప్రొడక్షన్ హౌస్ ని బట్టి ఒక్కో సినిమాకి ఐదు కోట్ల నుండి 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుందని సమాచారం.కేవలం కంటెంట్ రిలేటెడ్ సినిమాలకే కాకుండా గ్లామర్ పాత్రలకు కూడా సై అంటుండటంతో మేకర్స్ కూడా అడిగినంత ఇచ్చేందుకు అసలు వెనుకాడటం లేదట .ఇక సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో జాన్వి ఎంట్రీ ఒక సెన్సేషనల్ అని చెప్పాలి.
బిజినెస్ ఉమెన్ గానూ ప్రూవ్ చేసుకుంటున్న జాన్వీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడిగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమాతో టాలీవుడ్ ను పలకరించిన ఈ బ్యూటీ ఈ చిత్రానికి గాను దాదాపు మూడుకోట్ల పారితోషికం అందుకుందని ఇన్సైడ్ టాక్.తాజాగా టాలీవుడ్ ని షేక్ చేసిన పెద్ది సినిమా కోసం ఈ అమ్మడు ఏకంగా నాలుగు కోట్ల వరకు వసూలు చేసినట్టు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త .మొత్తానికి ఒకవైపు బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ లు , మరోవైపు సౌత్ సినిమాలు, ఇంకోవైపు కోట్లు కురిపించే బ్రాండ్ ప్రమోషన్స్ .. ఇలా రెండు చేతులతో సంపాదిస్తున్న జాన్వి హీరోయిన్ గానే కాకుండా బిజినెస్ ఉమెన్ గానూ ప్రూవ్ చేసుకుందని చెప్పాలి .