E-Paper
Advertisement

15వ రోజు కూడా తగ్గని సమంత జోరు.. 100 కోట్ల క్లబ్‌లోకి ‘మా ఇంటి బంగారం’?

15వ రోజు కూడా తగ్గని సమంత జోరు.. 100 కోట్ల క్లబ్‌లోకి ‘మా ఇంటి బంగారం’?
Advertisement

Samantha Records: సరైన లేడీ ఓరియంటెడ్ సినిమా తీస్తే కాసుల వర్షం ఎలా కురుస్తుందో మరోసారి ప్రూవ్  చేసింది సమంత.అప్పట్లో విజయశాంతి లేడి అమితాబ్‌గా బాక్సాఫీస్‌ను ఏలితే,ఆ తర్వాత అనుష్క శెట్టి అరుంధతితో ట్రెండ్ సెట్ చేసింది. ఇక మహానటిగా కీర్తి సురేష్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా కాదు.అదే క్రమంలో ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ తిరగరాస్తు బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపిస్తుంది సమంత.ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన మా ఇంటి బంగారం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తుంది.

ఈ సినిమా గత రెండు వారాలుగా పోటీ అనేది లేకుండా బాక్సాఫీస్ వద్ద సరి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది .ఈ క్రమంలోని టాలీవుడ్ లో  హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన  లేడీ ఓరియంటెడ్ సినిమాగా నిలవడం విశేషం.ఇక ట్రాలాలా బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందే డిజిటల్, శాటిలైట్  రైట్స్ రూపంలో టేబుల్ ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది.

Advertisement

ఈ సినిమా థియేట్రికల్ రన్ 35 కోట్ల రూపాయలుగా లెక్క కట్టారు ట్రేడ్ పండితులు .అయితే సమంత క్రేజ్, కంటెంట్ లోని పవర్ తో ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్స్ తెచ్చుకోవడం విశేషం .అలా మొదటి వారంలోని ఇండియా వైడ్ గా 34 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ఈ సినిమా రెండు వారంలోనూ అది జోష్ కంటిన్యూ చేస్తూ ఏకంగా మరో 20 కోట్లను వెనకేయడం విశేషం.

దాంతో కేవలం 14 రోజుల్లోనే ఇండియా వైడ్ గా 54 కోట్ల నెట్ ,69.5 కోట్ల గ్రాస్ వసూల్లని సాధించి కలెక్షన్ల సునామీని సృష్టించింది.ఈ క్రమంలోనే  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ళు సరికొత్త రికార్డులని రీసెట్ చేస్తున్నాయి.ముఖ్యంగా తెలంగాణ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన సమంత కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ చూసింది.అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా 25 కోట్ల రూపాయల గ్రాస్‌తో దూసుకుపోవడం విశేషం.

Advertisement

ఇక పక్క రాష్ట్రాలైన కర్ణాటకలో 11 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, మిగిలిన రెస్ట్ ఆఫ్ ఇండియా మార్కెట్లో మరో కోటి రూపాయలను తన ఖాతాలో వేసుకుంది .అలా  ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేకుండా  అన్ని ప్రాంతాల ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతుండడం విశేషం.ఇక ఓవర్సీస్ మార్కెట్ కి వస్తే నార్త్ అమెరికాలో ఈ సినిమా ఏకంగా రెండు మిలియన్ డాలర్ల మార్కుని అందుకుని సంచలనం స్ప్రుష్టించింది.యూకే ఆన్లైన్ మార్కెట్లలో 115 K పౌండ్లు,మలేషియాలో 100KRM, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లలో 250K డాలర్లను తన ఖాతాలో వేసుకుని మొత్తంగా అంతర్జాతీయ మార్కెట్లో మూడు మిలియన్ డాలర్ల రికార్డు వసూల్లని చూస్తుందంటే బాక్సాఫీస్ వద్ద సామ్ ఏ రేంజ్ లో గర్జిస్తుందో అర్థమవుతుంది.ఈ సినిమా ఇండియన్ కరెన్సీలో దాదాపు 25 కోట్ల రూపాయల గ్రాస్ ఓవర్సీస్ నుంచి రాబట్టడం విశేషం.

దీంతో మొత్తంగా 14 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 95 కోట్ల రూపాయల గ్రాస్ సొంతం చేసుకున్న ఈ సినిమా 100 కోట్లను సాధించడానికి ఇంకెంత దూరంలో లేదన్నది నిజం .ఇక 15వ రోజు కూడా కోటికి పైగా గ్రాస్ సాధించిన ఈ సినిమా వీకెండ్ లో మరిన్ని వసూళ్లను కొల్లగొట్టడం పెద్ద విషయం ఏమీ కాదు.మొత్తం మీద రెండు రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల పోస్టర్ ని రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదు.

also read:జాన్వీ కపూర్ మంత్లీ ఇన్‌కమ్ తెలిస్తే మైండ్ బ్లాకే!

గతంలో కీర్తి సురేష్ నటించిన మహానటి సాధించిన 85 కోట్ల లైఫ్ టైం కలెక్షన్స్ ని ఇప్పటికే బద్దలు కొట్టింది ఈ సినిమా.అంతేకాకుండా 2026 ఇయర్లో అత్యధిక వసూళ్ళు  సాధించిన టాప్ సినిమాల జాబితాలో ఆరవ సినిమాగా నిలిచి లేడీ సూపర్ స్టార్ అని మరోసారి ప్రూవ్ చేసుకుంది సమంత.చూడాలి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ మా ఇంటి బంగారం లాంగ్ రన్ ఎక్కడ ముగుస్తుందో !

Related News

థియేటర్లకు షాక్.. టికెట్ ధరలపై సర్కార్ కొత్త లెక్క!

వెంకీ–కళ్యాణ్ రామ్ మూవీ.. రిలీజ్ డేట్‌నే టైటిల్‌గా పెట్టేశావు కదయ్యా అనీలూ!

సుమలత ఏకపక్ష నిర్ణయం.. జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్!

మరో లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని.. వీడియో వైరల్!

అఖండ-2, పెద్ది సినిమాలకు కొత్త రూల్‌.. 20% ఇవ్వాల్సిందే !

బ్రహ్మానందం అన్నయ్య భావోద్వేగం.. ఆ పిలుపు కోసం ఎదురు చూపంటూ..

ఫైట్ చేసిన భట్టు.. చంద్రకళ సేఫ్, మొత్తానికి ఇద్దరినీ కలిపేశారుగా!

మహాకాళి నుండి బిగ్ అప్డేట్.. మాస్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

Big Stories

Advertisement
×