Jayam Ravi:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రవి మోహన్ (Ravi Mohan) అలియాస్ జయం రవి (Jayam Ravi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఈయన.. అనూహ్యంగా విడాకుల వార్తలతో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇద్దరు కొడుకులు జన్మించినప్పటికీ.. భార్యకు విడాకులు ఇవ్వాలనే ఆయన ఆలోచన అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ముఖ్యంగా ఆర్తి , ఆమె తల్లి జయం రవి గురించి ఎంత చెప్పినా.. చాలామంది వీరిపైనే విమర్శలు గుప్పించారు. జయం రవి మంచి మనిషి అని, తల్లీకూతుళ్ల వేధింపులు తట్టుకోలేక జయం రవి విడాకులు కోరి ఉంటారు అంటూ కూడా కొంతమంది కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు జయం రవికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ జయం రవి పై విమర్శలు గుప్పిస్తూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే సింగర్ కెనీషా (Singer Kenisha) తో జయం రవి రహస్య రిలేషన్ కొనసాగిస్తున్నారంటూ ఆర్తి ఆరోపించిన విషయం తెలిసిందే. పైగా జయం రవి, సింగర్ కెనీషా పలుమార్లు బహిరంగంగా పలు వేడుకల్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉండగా..ఒకవైపు విడాకుల వ్యవహారం నడుస్తుండగానే ..మరొకవైపు తన ప్రేయసితో ఏకంగా సిగరెట్ తాగుతూ జయం రవి కనిపించారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో జయం రవి, కెనీషా ఇద్దరు చాలా క్యాజువల్ లుక్ లో కనిపించారు. ఏదో గ్రూపు మీటింగ్ లో డిస్కషన్ చేస్తున్నట్టుగా ఉన్న ఈ వీడియోలో జయం రవి సిగరెట్ తాగుతూ దానిని కెనీషా కు ఇవ్వడం.. ఆమె కూడా దానిని పీల్చడం ఆ వీడియోలో చూడవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒక ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని షేర్ చేస్తూ..” విడాకుల వార్త బయటపడినప్పుడు మేము జయం రవి కి మద్దతుగా నిలిచాము. ఎందుకంటే అతని వాదనను మనస్ఫూర్తిగా నమ్మాము. కానీ అతని వీడియోలు చూశాక వాస్తవ పరిస్థితి అర్థం అయింది. ముఖ్యంగా పరిస్థితులు, అసలు వాస్తవాలు ఇలా మారుతుండడం చూసి నిరాశ చెందాము. ముఖ్యంగా ఈ వీడియోల వల్ల అతడి పై ఉన్న గౌరవం కూడా పోయింది” అంటూ ఫైర్ అయ్యారు. మొత్తానికైతే ఆర్తి చెప్పిన మాట నిజమేనని.. జయం రవి కెనీషాతో రిలేషన్ పెట్టుకోవడం వల్లే ఆమెకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు .
also read:మాధురి రాథోడ్ సూసైడ్ నోట్ లో బయటపడ్డ పేర్లు!
ఇదిలా ఉండగా జూన్ నెలలో జరిగిన కోర్టు విచారణలో జయం రవికి వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఏప్రిల్ లో మొదలైన విడాకుల వ్యవహారంలో ఆయన భార్య ఆర్తి, తమ పిల్లల పాఠశాల ఫీజులతో పాటు మధ్యంతర భరణం చెల్లించలేదని ఆరోపిస్తూ కుటుంబ సంక్షేమ న్యాయస్థానాన్ని ఈ ఏడాది జూన్లో ఆశ్రయించింది. ఈ పిటీషన్ ను తిరస్కరించడంతో మద్రాస్ హైకోర్టును ఆమె ఆశ్రయించారు.. ఇక దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రెండు వారాల్లోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కుటుంబ సంక్షేమ న్యాయస్థానాన్ని ఆదేశించింది.
I stood up for Jayam Ravi when the divorce news broke because I genuinely believed his side. But seeing videos of him is a reality check. Disappointed to see how things are turning out definitely lost respect for him.
Day by day Ravi 🤒 pic.twitter.com/cjwTaoL9x4
— Sundar Vijay (@ItsSundarVJ) September 6, 2026