Upcoming Kia Cars in India: భారత కారు మార్కెట్లో కియా కంపెనీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే పలు SUVలు, MPVలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ.. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త మోడళ్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కేవలం కొత్త కార్లే కాకుండా CNG, హైబ్రిడ్, ఫ్లెక్స్ ఫ్యూయల్, ఎలక్ట్రిక్ టెక్నాలజీతో కూడిన వెహికల్స్ ను తీసుకురానుంది. వాటిలో 10 కీలక మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కియా కేరెన్స్‌కు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG వెర్షన్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం బయట నుంచి CNG కిట్ అమర్చుకునే అవకాశం ఉండగా, కొత్త మోడల్‌లో కంపెనీయే CNG సిస్టమ్‌ను ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయనుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ వెర్షన్ 96 PS పవర్, 123 Nm టార్క్ అందించనుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉండే అవకాశం ఉంది.
కేరెన్స్ క్లావిస్‌కు కూడా ఫ్యాక్టరీ CNG వెర్షన్ రానుంది. ఇదే 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ మోడల్ మారుతి XL6 లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ప్రీమియం MPV సెగ్మెంట్‌లో కియా కార్నివాల్ హైబ్రిడ్‌ను తీసుకురానుంది. ఇందులో 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటాయి. మొత్తం 242 bhp పవర్, 367 Nm టార్క్ అందించే అవకాశం ఉంది. మూడు వరుసల క్యాబిన్, రిలాక్సేషన్ సీట్లు, డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్లు, బోస్ ఆడియో లాంటి ప్రీమియం ఫీచర్లు కొనసాగనున్నాయి.
కియా సైరోస్‌కు ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్ కూడా సిద్ధమవుతోంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా రూపొందే ఈ మోడల్ E0 నుంచి E100 వరకు ఇంధనాన్ని ఉపయోగించేలా అభివృద్ధి చేస్తున్నారు.
కియా 2027లో సెకెండ్ జెనరేషన్ సోనెట్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త K1 ప్లాట్‌ఫామ్‌పై రూపొందే అవకాశం ఉంది. పెద్ద డిస్‌ప్లేలు, OTA అప్‌డేట్లు, లెవెల్ 2 ADAS లాంటి ఆధునిక ఫీచర్లు ఇందులో రావచ్చని అంచనా.
సెల్టోస్‌కు కూడా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ తీసుకురావాలని కియా భావిస్తోంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో హైబ్రిడ్ సిస్టమ్‌ను జత చేసే అవకాశం ఉంది. ఇంధన సామర్థ్యం సుమారు 25 కి.మీ వరకు ఉండవచ్చని అంచనా.
కేరెన్స్ ఫ్యామిలీలోనూ హైబ్రిడ్ టెక్నాలజీకి చోటు దక్కనుంది. నెక్ట్స్ జెనరేషన్ కేరెన్స్ లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ కలిగిన స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను తీసుకురావచ్చని అంచనా. 2029 నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
క్లావిస్‌కు కూడా 2029 నాటికి హైబ్రిడ్ వెర్షన్ తీసుకురావాలని కియా భావిస్తోంది. సెల్టోస్ హైబ్రిడ్‌కు దగ్గరగా ఉండే పవర్‌ట్రెయిన్‌ను ఇందులో ఉపయోగించే అవకాశం ఉంది. మూడు వరుసల సీటింగ్‌తో పాటు మెరుగైన మైలేజీ అందించనుంది.
భారత మార్కెట్ కోసం కియా కొత్త బి సెగ్మెంట్ ఎలక్ట్రిక్ SUVని స్థానికంగా అభివృద్ధి చేయనుంది. ఇది సైరోస్, సెల్టోస్ మధ్య స్థానంలో ఉండే అవకాశం ఉంది. దాదాపు 4.2 మీటర్ల పొడవుతో రావచ్చని అంచనా. బ్యాటరీ, రేంజ్, ధర వంటి వివరాలు ఇంకా వెల్లడించలేదు.
Read Also: కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఏముంది గురూ!