E-Paper
Advertisement

మాధురి రాథోడ్ సూసైడ్ నోట్ లో బయటపడ్డ పేర్లు!

మాధురి రాథోడ్ సూసైడ్ నోట్ లో బయటపడ్డ పేర్లు!
Advertisement

Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మాధురి రాథోడ్ (Madhuri Rathod) ఆత్మహత్యాయత్నం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా తన తోటి డ్యాన్సర్ అయిన ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని ఇప్పుడు వదిలేశాడు అని, మోసం చేశాడు అంటూ తన ఇంట్లోనే ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గది తలుపులు బద్దలు కొట్టి ఆమెను కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు.. ఒక లెటర్ రాసి అందులో తనను ఈ స్థితికి తీసుకొచ్చిన కొంతమంది పేర్లను ఆమె బయట పెట్టింది.

బయటపడ్డ మాధురి రాథోడ్ సూసైడ్ నోట్..

ఇప్పుడు ఆ లెటర్ కాస్త వైరల్ అవ్వడంతో అందులో ఉన్న కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా మాధురి రాథోడ్ రాసిన ఆ సూసైడ్ నోట్ లో ఆమె మరింత భావోద్వేగానికి లోనయ్యింది. ఈ సూసైడ్ నోట్లో.. “అందరికీ సారీ.. ఇకపై నాకు బతకాలని లేదు. పండు ఐ లవ్ యూ రా.. పిల్లలందరికీ సారీ రా.. నా కుటుంబం నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తోంది. అభిమానులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. నేను తప్పు చేశాను. అందుకే శిక్షగా చనిపోవాలనుకుంటున్నాను. బయట చూపించుకునేందుకు ముఖం లేదు. నా పరువు పోయింది. కుటుంబానికి మంచి పేరు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. కానీ ఆ కుటుంబం పరువు నా వల్లే పోయింది.

నా చావుకు కారణం వారే – మాధురి రాథోడ్

Advertisement

నా చావుకి కారణం శరణ్య, ఈశ్వర సాయి , సంధ్య. అలాగే ఎవరైతే నన్ను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారో వారందరూ కూడా.. వాళ్ళందరికీ శిక్ష పడాలి. నాకు న్యాయం జరగాలి.ఈ సొసైటీలో నాకు న్యాయం జరగదని భావించే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను” అంటూ భావోద్వేగానికి లోనవుతూ.. ఆ భావోద్వేగానికి అక్షర రూపం దాల్చింది మాధురి రాథోడ్. ప్రస్తుతం ఈ సూసైడ్ నోట్ వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈశ్వర్ సాయి ఆయన భార్య శరణ్య ఓకే.. ఈ సంధ్య ఎవరు? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇన్ని రోజులు శరణ్యకు అండగా మాధురికి వ్యతిరేకంగా నిలిచిన ఆ థర్డ్ పర్సన్ ఈమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ALSO READ:ఒకేసారి 5 భాషల్లో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం.. ఏ హోస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

మనస్థాపానికి గురై బలవన్మరణం..

Advertisement

ఇక అసలేమైంది? అనే విషయానికి వస్తే.. మాధురి రాథోడ్ ఇటీవల తన తోటి ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయితో వేములవాడలోని రెడ్డి లాడ్జిలో రెడ్ హ్యాండెడ్గా ఈశ్వర్ సాయి భార్య శరణ్యకి పట్టుబడింది. శరణ్య వీరిద్దరిని పట్టుకొని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది. ఈశ్వర్ సాయి మాధురిని పట్టించుకోకపోవడం, అతడి భార్య తప్పంతా మాధురీదేనని ప్రచారం చేయడంతో ఆమె మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో మరింత మనస్థాపానికి గురైన ఈమె.. ఇలా సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Related News

ఒకేసారి 5 భాషల్లో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం.. ఏ హోస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

Bigg Boss 10 Telugu : బెంగాలి బ్యూటీకి ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

బిగ్ బాస్ 10 లోకి విలన్ ఎంట్రీ.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Karthika Deepam 2 Serial Today Episode September 7th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: కార్తీక్‌ ను ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్న శివనారాయణ

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మాస్టర్ ప్లాన్.. గుణకు షాకిచ్చిన రోహిణి.. శృతి పై ప్రభా సీరియస్..

Podarillu Today Episode : చక్రిని ఆడుకున్న మహా.. శైలు ఫుల్ హ్యాపీ.. పెద్ది పెళ్లి జరుగుతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు మాటతో వేదవతి కన్నీళ్లు.. ధీరజ్ VS ప్రేమ.. శ్రీవల్లి పై అనుమానం..

Big Stories

Advertisement
×