E-Paper
Advertisement

Jr.NTR Pranathi: భార్య ప్రణతి పుట్టినరోజు.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన తారక్.. ఫోటోలు వైరల్!

Jr.NTR Pranathi: భార్య ప్రణతి పుట్టినరోజు.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన తారక్.. ఫోటోలు వైరల్!
Advertisement

Jr.NTR Pranathi: టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా ఈ సినిమా పనులలో బిజీగా ఉన్న తారక్ ఇటీవల కాలంలో పెద్దగా బయట కూడా ఎక్కడ కనిపించలేదు. ఇలా ఒకవైపు సినిమా పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు తన ఫ్యామిలీకి కేటాయించాల్సిన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారని చెప్పాలి.

భార్యకు సర్ ప్రైజ్ పార్టీ ఇచ్చిన తారక్..

ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి(Lakshmi Pranathi) పుట్టినరోజు(Birthday) సందర్భంగా ఎన్టీఆర్ ఎంతో ఘనంగా పార్టీ ఇచ్చారు. లక్ష్మీ ప్రణతి మార్చి 26న పుట్టినరోజును జరుపుకున్నారు. నేడు లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ నిన్న రాత్రి ఓ లావిష్ పార్టీ అరెంజ్ చేశారు. ఈ పార్టీలో భాగంగా లక్ష్మీ ప్రణతి క్లోజ్ ఫ్రెండ్స్ హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రణతి ఫ్రెండ్స్ తో పాటు రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ ఆయన భార్య కూడా పాల్గొన్నారని తెలుస్తోంది.

క్లోజ్ ఫ్రెండ్స్ తో ప్రణతి బర్త్ డే సెలబ్రేషన్స్..

Advertisement

ఎన్టీఆర్ భార్య ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ప్రణతి తారక్ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ ఈ పార్టీలో ఎంతో ఎంజాయ్ చేస్తారని ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు లక్ష్మీ ప్రణతికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు  తెలియజేస్తున్నారు. ప్రతి ఏడాది ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఇలా ఘనంగా పార్టీ ఇస్తూ తన భార్య పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక లక్ష్మీ ప్రణతి విషయానికి వస్తే.. ఈమె సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయి కాదనే సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాస్ కుమార్తెగా అందరికీ సుపరిచితమే .ఇక ఈమె ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె సోదరుడు నితిన్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు.

Advertisement

ఇక ఎన్టీఆర్ ప్రణతి దంపతులకు ఇద్దరు అబ్బాయిలు అనే సంగతి తెలిసిందే. ఇక లక్ష్మి ప్రణతి సోషల్ మీడియాకి కూడా పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తారక్ ప్రస్తుతం డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా దాదాపు షూటింగ్ సగభాగం పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఇటీవలే జార్జియా షెడ్యూల్ చిత్రీకరణ ముగించుకొని చిత్రబృందం హైదరాబాద్ చేరుకున్నారు.

Also Read: Harish Shankar: నీకు నచ్చినట్టు తీస్తే మాకు ఎందుకు చూపించావ్? డైరెక్టర్ హరీష్ శంకర్ పై ట్రోల్స్!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×