E-Paper
Advertisement

Harish Shankar: నీకు నచ్చినట్టు తీస్తే మాకు ఎందుకు చూపించావ్? డైరెక్టర్ హరీష్ శంకర్ పై ట్రోల్స్!

Harish Shankar: నీకు నచ్చినట్టు తీస్తే మాకు ఎందుకు చూపించావ్? డైరెక్టర్ హరీష్ శంకర్ పై ట్రోల్స్!
Advertisement

Harish Shankar: డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సినిమా మార్చి 19వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం చేరుకోలేకపోయింది. ఇలా ఈ సినిమా పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరచడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల పట్ల డైరెక్టర్ పై పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ డబుల్ ఎంట్రీ పై హరీష్ క్లారిటీ..

ముఖ్యంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఒక సన్నివేశంలో జీప్ లో నుంచి ఒకసారి బయటకు వచ్చి విలన్ ను చంపిన తర్వాత మరోసారి కూడా జీప్ లో నుంచి బయటకు వచ్చినట్టు చూపించారు. అయితే ఈ సన్నివేశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలా ఈ సీన్ పట్ల విమర్శలు రావడంతో తాజాగా హరీష్ శంకర్ (Harish Shankar) ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సన్నివేశం గురించి వివరణ ఇచ్చారు.. తనకు ఏదైనా షాట్ నచ్చింది అంటే అక్కడ లాజిక్ గురించి ఆలోచించనని తెలిపారు. ఇక ఈ సన్నివేషంలో కూడా అదే జరిగిందని తెలిపారు . మొదట కళ్యాణ్ గారు వచ్చారు మరోసారి కూడా జీప్ నుంచి బయటకు వచ్చారు అదేంటి ఇలా రెండుసార్లు వచ్చారే అనుకున్నాను.

షాట్ నచ్చితే లాజిక్ గురించి ఆలోచించను..

Advertisement

ఆ సన్నివేశంలో నేనొక షాట్ తీశాను ఫైట్ మాస్టర్ మరొక షాట్ తీశారు. ఈ రెండు చాలా బాగా నచ్చడంతో తాను ఈ సినిమాలో అలాగే పెట్టేసానని హరీష్ శంకర్ ఈ విషయంపై వివరణ ఇచ్చారు. ఈ సన్నివేశం గురించి హరీష్ శంకర్ క్లారిటీ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ సినిమా నీకు నచ్చిన విధంగా తీస్తే మాకెందుకు చూపించావు నువ్వే చూసుకోవచ్చు కదా అంటూ మరోసారి ఈయన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు. అసలేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అంటూ మరికొందరు హరీష్ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.

నిరాశపరిచిన ఉస్తాద్ భగత్ సింగ్..

Advertisement

ఇలా హరీష్ శంకర్ ఈ సినిమా విషయంలో జరిగిన తప్పులను సమర్ధించుకుంటూ కామెంట్లు చేయడంతో మరోసారి విమర్శల పాలవుతున్నారు. ఇక ఉస్తాద్ సినిమా విషయానికి వస్తే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోవడం అవే పాత డైలాగులు, పాత స్టోరీతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్న నటి శ్రీలీలకు మరో డిజాస్టర్ తప్పలేదని చెప్పాలి.

Also Read: Balakrishna: హీరోయిన్ కాళ్ళు మొక్కిన బాలకృష్ణ..నెటిజన్స్ రియాక్షన్ ఇదే!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×