BigTV English

Jr NTR New Look: ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయి… ఎన్టీఆర్ షాకింగ్ ట్రాన్స్ ఫాం.. హాట్ టాపిక్ గా కొత్త లుక్..

Jr NTR New Look: ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయి… ఎన్టీఆర్ షాకింగ్ ట్రాన్స్ ఫాం.. హాట్ టాపిక్ గా కొత్త లుక్..


Jr NTR New Look: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల లైనప్ మామూలుగా లేదు. మరో నాలుగైదేళ్లు ఫుల్ బిజీ. ఇప్పటికే చేతిలో వార్ 2, ప్రశాంత్ నీల్ డ్రాగన్, కొరటాల శివ దేవర 2 చిత్రాలను ఉన్నాయి. ఆ తర్వాత తివిక్రమ్ తో మైథలాజిక్ డ్రామా, తమిళ దర్శకుడు నెల్సన్ తో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఏడాది ఒకటి చొప్పున ఐదేళ్లు తారక్ సినిమాల జాతర ఉండోతోంది. వార్ 2 ట్రైలర్ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇందులో ఆయన షాకింగ్ మేకోవర్, బీస్ట్ లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది. ఆగష్టు 14న థియటర్లలో మాస్ జాతరే అని అభిమానులంత ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ మధ్య ఎన్టీఆర్ లుక్ రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన బాగా సన్నబడ్డారు.

ఆ లుక్ పై ట్రోల్స్


ఈ లుక్ పై భిన్నాభిప్రాయలు వస్తున్నాయి. అతడి లుక్ దారుణంగా ఉందని, ఏదో అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నట్ట పేలగా ఉన్నాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బక్క బలుచగా.. ముఖంలో గ్లో పోయిందని ట్రోల్ చేశారు. అయితే అతడి తాజా లుక్ అందరిని సర్ప్రైజ్ చేస్తోంది. ఇటీవల బయటకు కనిపించిన ఎన్టీఆర్ వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో తారక్ న్యూలుక్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో ముఖంగా గ్లోయింగ్ మెరిసిపోతుంది. ఈ లుక్ ప్రస్తుతం ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తోంది. గతంలోని లుక్ కంటే ఇందులో యాక్టివ్ గా, హెల్తీగా కనిపిస్తున్నారు. బాడీ సన్నగా ఉన్నప్పటికీ ముఖం మాత్రం ముఖంలో చామ్ తో వెలిగిపోతుంది.  దీంతో ప్రస్తుతం అతడి లుక్ హాట్ టాపిక్ మారింది.

అంచనాలు పెంచుతోన్న కొత్త లుక్

ఇది కదా.. తారక్ అన్న మాస్.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. ఈ కొత్త లుక్ ఎలా ఉందో అంటూ అభిమానులంత కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ తన లేటెస్ట్ లుక్ నెట్టింట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఈ కొత్త లుక్ ఫ్యాన్స్ లో మరింత అంచనాలు పెంచేస్తోంది. ఎందుకంటే ఇది ప్రశాంత్ నీల్ డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా కోసమే మేకోవర్ అయిన విషయం తెలిసింది. మాస్ యాక్షన్ డ్రామాగా డార్క్ థీమ్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో తారక్ లుక్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తన సినిమాలో హీరోల మంచి ఫిట్ నెస్ తో చూపించే ప్రశాంత్.. తారక్ ని మాత్రం బక్క పలుచని రూపంలో చూపించబోతున్నాడు.

డ్రాగన్ మాస్ అవతార్..

ఈ సినిమాలో తారక్ లుక్ ఎలా డిజైన్ చేశాడు.. డ్రాగన్ అవతారం ఎలా ఉండబోతుందా అని అభిమానుల్లో అంచనాలు వేసుకుంటున్నారు. కాగా తారక్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా తారక్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ తారక్ బీస్ట్ లుక్ కి ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తోంది. ఇది తారక్ బాలీవుడ్ ఎంట్రీ చిత్రం కావడంతో మంచి బజ్ నెలకొంది. ఆగష్టు 14న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: Uday Kiran: ఉదయ్ కిరణ్ తో నటించిన హీరోయిన్ దుర్మరణం.. ఇప్పటికీ మిస్టరీ.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×