Cheetah Video Viral: హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కోట అయిన గోల్కొండ ప్రాంతంలో ఇవాళ చిరుత సంచారం కలకలం రేపింది. ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో ఈ చిరుత కనిపించినట్లు స్థానికులు గుర్తించారు. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గోల్కొండ కోట సమీపంలోని ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ చిరుత గోల్కొండ కోట సమీపంలోని ఇబ్రహీంబాగ్ ప్రాంతంలో సంచరిస్తూ కనిపించిందని కొంత మంది యువకులు చెబుతున్నారు.
అక్కడున్న యువత చిరుతను మొబైల్ ఫోన్ వీడియోలు, ఫోటోలు తీశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చిరుత సంచారం గురించి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతను అటవీ ప్రాంతంలోకి తరలించే ప్రయత్నం చేశారు. స్థానికులు కూడా ఆటో, బైక్ లైట్లతో శబ్దాలు చేస్తూ చిరుతను భయపెట్టి అడవిలోకి పంపించేందుకు ప్రయత్నించారు.
ఇదిగో వీడియో…
తారామతి వెనకభాగం మూసి వైపు చిరుత వెళ్లినట్టు తెలుస్తోంది. గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మంచి రేవుల నుంచి ఈ చిరుతకు నగరంలోకి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చిరుతను బంధించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.
ALSO READ: Amit Shah: మీరు మరో 20 ఏళ్లు అక్కడే ఉంటారు.. లోక్‌సభలో ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం
అయితే.. నగరంలో చిరుత సంచరిస్తుండడంతో భాగ్యనగరవాలసులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో తిరుమల, కర్నూలు, నాగర్‌కర్నూల్, వరంగల్, సంగరాడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ లాంటి ప్రాంతాల్లోనూ చిరుతలు జనావాసాల్లో కనిపించాయి. గోల్కొండ లాంటి చారిత్రాత్మక, పర్యాటక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం పర్యాటకులు, స్థానిక ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఇనుప కంచెలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, చిరుతలు జనావాసాల్లోకి రాకుండా నివారించడం అధికారులకు ఛాలెంజ్ గా మారింది.
అటవీ శాఖ సిబ్బంది ఈ ప్రాంతంలో నిఘా పెంచారు. స్థానికులకు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సంఘటన పర్యాటకులు, స్థానికుల భద్రతపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. చిరుతలు ఆహారం కోసం లేదా నివాస ప్రాంతాల సమీపంలోని అడవుల నుండి బయటకు రావడం వల్ల ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు.