Uday Kiran Heroine Death Mystery: దివంగత నటుడు, హీరో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండ వచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. బ్యాక్ టూ బ్యాక్ లవ్ ఎంటర్టైనర్ చిత్రాలు చేస్తూ.. హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఓ వెలుగు వెలిగాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ప్రేమకథా చిత్రాలంటే ఉదయ్ కిరణ్ పేరు మాత్రమే వినిపించేలా గుర్తింపు పొందాడు. అప్పుడు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లు ఉన్నా వారందరికి ఎక్కువ క్రేజ్ ఉదయ్ కిరణ్ కి మాత్రమే ఉండేది. వరుస హిట్స్ ఫుల్ దూకుడు మీదున్న ఆయనకు ఆ తర్వాత ప్లాప్స్ ఎదురయ్యాయి. అప్పటి నుంచి అతడి కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది. మళ్లీ నిలదొక్కునే ప్రయత్నం చేసినా.. కుదరలేదు.
ఒక్కసారి కెరీర్ డౌన్ ఫాల్
ఆ తర్వాత స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి రావడం.. దర్శక, నిర్మాతలు వారిపైనే ఫోకస్ పెట్టారు. దీంతో అగ్ర హీరో ఇండస్ట్రీలో కొనసాగుతాడనుకున్న అతడి కెరీర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఆఖరికి అవకాశాలు కూడా లేకుండ పోయాయి. ఆ తర్వాత పెళ్లి, ఆత్మహత్య గురించి మీకు తెలిసిందే. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గల కారణాలపై క్లారిటీ లేదు. అయితే.. అచ్చం ఉదయ్ కిరణ్ లాగే ఆయనతో నటించిన ఓ హీరోయిన్ కెరీర్ కూడా అర్థాంతరంగా ముగిసింది. చేసింది నాలుగైదు సినిమాలే.. తనదైన నటన, అందం అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. నటిగా ఆమెకు ఎంతో కెరీర్ ఉందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా 20 ఏళ్లకే ఆమె జీవితం ముగిసింది. ఆమె మరెవరో కాదు.. ప్రత్యూష. ఈ పేరు వింటే చాలు.. ఆమె ఆత్మహత్య ఘటన, న్యాయం కోసం ఆమె తల్లి చేసిన పోరాటమే గుర్తొస్తాయి. ఇప్పటికీ ఆమె మరణం ఓ సస్పెన్స్.
అచ్చం ఉదయ్ కిరణ్ లాగే ఆమె మరణం..
అది హత్యా? ఆత్మహత్య? అనేది వీడని చిక్కు ప్రశ్న. ఎందుకంటే ఆమె మరణం తర్వాత ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. కానీ, అవన్ని వట్టి ఆరోపణలు మాత్రమే అంటున్నారు. సినిమాలోని సస్పెన్స్ లా ఉంది ప్రత్యూష మరణం. రాయుడు చిత్రంతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ వెంటనే శ్రీరాములయ్య, సముద్రం, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని వంటి సినిమాలు చేసింది. అన్నింటిలోనూ ప్రధాన పాత్రలు పోషించింది. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందింది. వెండితెరపై ఆమెను చూసిన ఇండస్ట్రీలో సావిత్ర, జమన లాంటి నటి దొరకిందని అభిమానులంత అనుకున్నారు. ఆమెకు వస్తున్న ఆఫర్స్ చూసి అతి త్వరలోనే అగ్ర నటి స్థానంలో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలంత అభిప్రాయపడ్డారు. అలా ఆమె సినీ కెరీర్ బిజీ, బిజీగా సాగింది.
అవే చివరి మాటలు
అంత బాగుంటే నితిన్ జయం సినిమాలోనే ఆమె హీరోయిన్. కానీ, కలుసుకోవాలని మూవీ ఆమె చివరి చిత్రం అవుతుందని ఎవరూ ఊహించలేదు. జయం మూవీ స్టోరీ ఒకే అయ్యిందని, సదరు ప్రొడక్షన్ సంస్థతో చర్చలు జరుపుతుంది. ఆమె చావు ముందు ప్రత్యూష తల్లితో చెప్పిన మాట. కానీ, అవే ఆమె చివరి మాటలు అవుతాయని ఆమె తల్లి సరోజిని కూడా ఊహించలేదు. ఈ మాట చెప్పిన కొన్ని గంటలకే.. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని, ఆస్పత్రిలో ఉందంటూ ఆమె తల్లికి కబురు వచ్చింది. దీంతో ఏమైందా అని ఆస్పత్రికి వెళ్లిన ఆమె తల్లికి ప్రత్యూష శవాన్ని ఇచ్చారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పరికిది కాదని, , ఇది హత్య అని ఆమె తల్లి చెప్పిన ఎవరూ పట్టించుకోలేదు. కొన్నేళ్ల పాటు ఆమె న్యాయ పోరాటం చేసింది. ఇప్పటికీ ప్రత్యూష ఆత్మహత్య కేసులో ఆమె తల్లికి న్యాయం జరగలేదు.
ఇప్పటికీ మిస్టరీనే
అయితే ఆమె మరణం వెనుక పొలిటికల్ లీడర్ల హస్తం ఉందని, అందుకే ఈ కేసులో ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఆమె విషం తీసుకుని మరణించినట్టు చెప్పారు. కానీ, ఆమె ఒంటిపై గాయాలు, బట్టలపై రక్తం మరకలు ఆమె మరణంపై ఎన్నో అనుమానాలకు దారి తీసింది. కానీ, ఎవరూ కూడా వాటిని పట్టించుకోకుండ ప్రత్యూషది ఆత్మహత్యేనంటూ వాదించారు. పలువురు నుంచి ఆమె తల్లి సరోజిని మద్దతు కోరినా.. ఆమెకు అండగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆఖరికి ప్రత్యూష తల్లి కూతురికి న్యాయం కావాలని పోరాడి పోరాటి అలసిపోయింది. కానీ, ఆమె ప్రత్యూష మరణానికి గల కారణాలు ఇప్పటికీ బయటకు రాలేదు. ఆమె ఆత్మహత్య… ఇప్పటీకి మిస్టరీగానే ఉంది. అచ్చం ఉదయ్ కిరణ్ లాగే.. ప్రత్యూష మరణంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు.. రహస్యంగానే ఉండిపోయాయి.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై అల్లు అరవింద్ పై చేయి.. వీరమల్లును వెనక్కి నెట్టి..