BigTV English

Heroin Look: బాబోయ్.. గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్.. ఈమె ఎవరో తెలుసా?

Heroin Look: బాబోయ్.. గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్.. ఈమె ఎవరో తెలుసా?


Actress Payal Gosh Shocking Look: హీరోయిన్ అంటే నాజుకైన నడుము, ఆకట్టుకునే అందం, మెస్మరైజింగ్ లుక్. అలా అయితే వారిని ఆడియన్స్ స్వీకరిస్తారు. కాస్తా బొద్దుగా కనిపించిన.. బాడీ షేమింగ్ కి దిగుతారు. దీంతో హీరోయిన్లు చాలా మంది అప్పియరెన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఇదంత చేతిలో ఆఫర్స్ ఉన్నంత వరకే. ఇక వారు ఇండస్ట్రీకి దూరమయ్యారంటే.. వారిలో ఎంతో ఛేంజస్ కనిపిస్తాయి. తెరపై సన్నగా, నాజుగ్గా కనిపించిన హీరోయిన్లంత.. బొద్దుగా మారిపోతుంటారు. ఆర్తి అగర్వాల్, రక్ష, నమిత వంటి ఎంతోమంది హీరోయిన్లు ఈ కోవాలోనే చేరుతారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ లుక్ అందరికి షాక్ గురిచేస్తోంది. ఒకప్పుడు తెలుగులో తన గ్లామర్ తో ఎంతోమందిని మాయ చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 తెలుగులో చేసింది రెండే సినిమాలు


ఆమె మరెవరో కాదు పాయల్ ఘోష్. బాలీవుడ్ నటి అయిన ఆమె తెలుగులో చేసింది రెండే రెండు సినిమాలు. కానీ, ఎన్టీఆర్ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకుంది. పాయల్ ఘోష్.. తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మంచు మనోజ్ ప్రయాణం మూవీతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఇందులో తన అందం, అభియనంతో తెలుగు ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘ఉసరవెల్లి’ సినిమాతో ఒవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇందులో చేసింది సైడ్ హీరోయిన్ క్యారెక్టర్ అయినా.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. హీరోయిన్.. తమన్నా ఫ్రెండ్ గా కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా స్లిమ్ గా, చూపు తిప్పుకొని అందంతో కుర్రకారు దృష్టిని ఆకట్టుకున్న ఈ సుందరి.. తాజాగా లుక్ ఫ్యాన్స్ ని షాక్ కు గురి చేసింది.

ఎన్టీఆర్ సినిమాతో గుర్తింపు

ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఆమె ఇంటర్య్వూలో ఇచ్చింది. ఇందులో చాలా బొద్దుగా మారి.. గుర్తుపట్టలేని విధంగా కనిపించింది. ఆమె చూసి.. ఇంతకీ ఆమె అప్పటి బ్యూటీ పాయల్ ఘోషేనా అని సందేహిస్తున్నారు ఆడియన్స్. చాలా కాలంతో తెరపై వచ్చిన ఆమె.. భారీగా బరువు పెరిగి తన ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది. ఆమె.. ఏంటీ పాయల్ ఇలా అయిపోయావు అంటూ అభిమానుంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పాయల్ మొదట హిందీ సీరియల్స్ తో తన కెరీర్ ప్రారంభించింది. అదే సమయంలో ప్రయాణం సినిమాతో తెలుగులో హీరోయిన్ ఛాన్న్ కొట్టేసింది. ఆ తర్వాత ఉసరవెల్లి సినిమాలో కనిపించి ఆకట్టుకుంది.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ఆ దర్శకుడిపై సంచలన కామెంట్స్

ఇక్కడ ఆమె వరుస ఆఫర్స్ రావడంతో.. హిందీ నుంచి పిలుపు వచ్చింది. హిందీలో పటేల్ కి పంజాబీ షాదీ, కోయి జానే నా, ఫైర్ ఆఫ్ లవ్, రెడ్ వంటి చిత్రాల్లో నటించింది. అలా బాలీవుడ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆమె మీ టూ ఉద్యమంలో భాగంగా.. 2020లో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ దర్శకుడి వల్ల తాను కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాంటూ బహిరంగ కామెంట్స్ చేసింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత ఆమె హిందీ పరిశ్రమకు పూర్తిగా దూరమైంది. అలా సుదీర్ఘ విరామంతో తర్వాత పాయల్ తాజాగా ఓ ఇంటర్య్వూలో మెరిసింది. ఇందులో భారీగా బరువు పెరిగి.. గుర్తు పట్టలేని విధంగా మారింది. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ లుక్ వైరల్ మారుతోంది.

Related News

Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బ్లాస్ట్, సీక్రెట్స్ రీవీల్ చేసిన జాన్వీ కపూర్  

Rishab Shetty : వివాదంపై స్పందించిన రిషబ్ శెట్టి, అప్పుడు తెలుగులో మాట్లాడుతా

Naga Vasmsi: సినిమా హక్కుల కోసం నాగ వంశీ ప్రయత్నం, ప్రభాస్ తో పోటీ అవసరమా?

Mega158 : మెగాస్టార్ సినిమా ముహూర్తం క్యాన్సిల్? ఆ సెంటిమెంట్ కోసమే వెయిటింగ్

Dimple Hayathi: వివాదంలో డింపుల్ హయతి… రహస్యంగా పెళ్లి కూడా చేసుకుందా?

Priyanka Mohan : పవన్ తో OG బ్యూటీ రొమాంటిక్ ఫోజులు.. ఆ క్లోజ్ నెస్ చూశారా?

Poonam Kaur: బాలయ్య vs చిరంజీవి.. పూనమ్ సంచలన పోస్ట్…అగ్గి రాజేసిందిగా!

IMDB Movie list: 25 ఏళ్లలో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ జాబితాలో ప్రభాస్, బన్నీ మూవీలు!

Big Stories

×