Back Manager Suicide: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూణే జిల్లాలో బారామతి పట్టణంలో బరోడా బ్యాంక్ లో పనిచేస్తున్న ఓ సీనియర్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యాంక్ ఆవరణలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఆరోగ్య సమస్యలు, పని భారం కారణంగా బ్యాంక్ సీనియర్ మేనేజర్ శివశంకర్ మిత్రా (52) సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. వారం రోజుల క్రితమే అతను రిజైన్ లెటర్ కూడా సమర్పించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇలా ఉన్నాయి.
పని ఒత్తిడి కారణంగానే సూసైడ్..
పోలీసులు వివరాల ప్రకారం.. యూపీ, ప్రయాగ్ రాజ్ కు చెందిన శివశంకర్ మిత్రా పూణే జిల్లాలో బారామతి పట్టణంలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి అతను ఆరోగ్య సమస్యలు, పని ఒత్తిడి గురవుతున్నారు. ఈ క్రమంలోనే జులై 11న ఉద్యోగం మానేస్తున్నట్టు రిజైన్ లెటర్ కూడా సమర్పించారు. ఉద్యోగానికి రిజైన్ చేశాక 90 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే జులై 17న డ్యూటీకి వెళ్లిన శివశంకర్ బ్యాంకింగ్ హవర్స్ ముగిసిన తర్వాత ఆఫీసులోని ఉన్నారు. మిగితా ఉద్యోగులు అందరూ ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఆఫీస్ వాచ్ మెన్ కూడా వెళ్లిపోయాడు.
బ్యాంక్‌లోనే రాత్రి 10 గంటలకు సూసైడ్
ఆ సమయంలో శివశంకర్ మిత్రా తన సహోద్యోగికి కాల్ చేసి తాడు తీసుకురమ్మని చెప్పాడు. అనంతరం ఆ తాడుతోనే రాత్రి 10 గంటలకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ఘటన బ్యాంక్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. శివశంకర్ మిత్రా ఇంటికి తిరిగి రాకపోవడం, ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడంతో ఆయన భార్య రాత్రి 12 గంటల సమయంలో బ్యాంకుకు చేరుకున్నారు. ఆఫీసులో లైట్లు వెలుగుతున్నా, లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఆమె సిబ్బందిని రప్పించి ఆఫీస్ డోర్లను ఓపెన్ చేసి చూడగా శివశంకర్ ఆత్మహత్య చేసుకున్నట్టు కనుగొన్నారు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ కూడా కనిపించింది.
సూసైడ్ నోట్‌లో ఏముందంటే..?
ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో శివశంకర్ అధిక పనిఒత్తిడిని కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ నోట్‌లో ఆయన ఎవరినీ నిందించలేదు. కానీ బ్యాంకు ఉద్యోగులపై అధిక ఒత్తిడి విధించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన తన భార్య, కుమార్తెకు క్షమాపణ చెప్పి, తన కళ్లను దానం చేయాలని కోరారు. బారామతి సిటీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విలాస్ నలే ప్రకారం.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. డెడ్ బాడీని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటన బ్యాంకింగ్ రంగంలో పనిఒత్తిడి సమస్యలపై చర్చకు దారి తీసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, సిబ్బంది కొరత వంటి సమస్యలపై దృష్టి సారించాలని హెచ్చరించింది.
ALSO READ: PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి కారణాలేంటి? ఇప్పుడు వెంటనే ఇలా చేయండి..
ALSO READ: Collector Swapnil Dinkar: ఈ కలెక్టర్ పని తీరు అద్భుతం.. రూ.500 కోట్లు ఖర్చు పెట్టి..?