Asia Cup : సెప్టెంబర్ లో జరగాల్సిన 2025 ఆసియా కప్ 2025 మరింత ఇబ్బందుల్లో పడింది. తాజాగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ లకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. శ్రీలంక క్రికెట్ కీలక అడుగు వేసి జులై 24న ఢాకా లో జరుగబోయే ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకుంది. అలాగే బీసీసీఐ కూడా తాజాగా బాయ్ కాట్ చేసినట్టు తెలిపింది. బంగ్లాదేశ్ లో ఈనెల 24న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ మీటింగ్ కి హాజరు కావడం లేదు బీసీసీఐ. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ లో సమావేశం జరిగితే హాజరుకాబోమని ఏసీసీకి తేల్చి చెప్పినట్టు సమాచారం. మరోవైపు ఏసీసీ చైర్ పర్సన్ గా పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఉండటం పై బీసీసీఐ అభ్యంతరం తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో సెప్టెంబర్ లో జరగాల్సిన ఆసియా కప్ పై అనిశ్చితి నెలకొంది.
Also Read : Vaibhav Suryavanshi : ధోని ముసలోడు అంటూ వైభవ్ ట్రోలింగ్.. ఆడుకుంటున్న ఫ్యాన్స్ !
బంగ్లాదేశ్ పర్యటన వాయిదా..
ఈ టోర్నమెంట్ లో టీమిండియా, శ్రీలంక జట్టు లేకపోవడంతో ఈ టోర్నమెంట్ భవిష్యత్ ను ప్రమాదంలో పడేస్తోంది. ఈ సారి ఆసియా కప్ టీ-20 ఫార్మాట్ లో జరుగనుంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 05 నుంచి ప్రారంభం కావచ్చు. జులై 24న ఢాకాలో జరుగనున్న ఏసీసీ సమావేశంలో బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ పాల్గొనకపోవడం వల్ల టోర్నమెంట్ జరగడం పై ప్రశ్నలు తలెత్తాయి. ఏసీసీ సమావేశం ఢాకాలో జరగడం పై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ప్రస్తుతం ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనను నిరవధికంగా వాయిదా వేయాలని బీసీసీఐ ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ని ఒప్పించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో రాజకీయ పరిస్థితి బాగాలేనందున బీసీసీఐ సంతోషంగా లేదు.
బాయ్ కాట్ చేసిన బీసీసీఐ
మరోవైపు ఆసియా కప్ నిర్వహణపై బీసీసీఐ మౌనం వహించడం స్పాన్సర్లను, ప్రసారకర్తలను గందరగోళానికి గురి చేసిందని పలు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా బాయ్ కాట్ చేయడంతో బంగ్లాదేశ్, పాకిస్తాన్ షాక్ తగిలినట్టు అవుతుంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతానికి రాజకీయ పరిస్థితి బాగా లేనందున ఏసీసీ ఈ ముఖ్యమైన సమావేశాన్ని ఢాకాలో నిర్వహించడం సరైనది కాదు. నివేదిక ప్రకారం, ఆసియా కప్ వాయిదా వేస్తే, బీసీసీసీ మరో సిరీస్ నిర్వహించాలని పరిశీలిస్తోంది. ఆసియా కప్ సెప్టెంబర్ 5 నుంచి UAEలో జరిగే అవకాశం ఉంది. ఆ సమయంలో భారతదేశంతో క్రికెట్ ఆడటానికి శ్రీలంక, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆసక్తి చూపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి భారత జట్టు రెండు, మూడు నెలలు ఖాలీగా కూర్చొవాలని బోర్డు కోరుకోదు. ఆసియా కప్ ఆతిథ్య హక్కులను నిలుపుకోవాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికీ టీ-20 ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నమెంట్ కు సన్నాహాలను ఖరారు చేసే ముందు ప్రభుత్వం ఆమోదం కోసం వేచి ఉన్నది. ఇక ఇప్పటికే ఈ ఏడాది పాకిస్తాన్ హాకీ జట్లకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. క్రికెట్ వేరే విషయం అని మరో అధికారి పేర్కొన్నారు.