E-Paper
Advertisement

కాజల్ కారవాన్‌లో జరిగిన ఘటన.. ఇన్నాళ్లకు బయటపెట్టిన హీరోయిన్!

కాజల్ కారవాన్‌లో జరిగిన ఘటన.. ఇన్నాళ్లకు బయటపెట్టిన హీరోయిన్!
Advertisement

Kajal Incident: కాజల్ అగర్వాల్.. ఇప్పుడంటే పెళ్లయ్యాక కాస్త సైలెంట్ అయింది కానీ ఒకప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్ లో చేసిన రచ్చ అంత ఇంతా కాదు లక్ష్మీ కళ్యాణం తో ఎంట్రీ ఇచ్చిన ఈ బాంబే బ్యూటీ మగధీరతో ఒక్కసారిగా టాప్ లీగ్ లోకి దూసుకొచ్చింది . అలాంటి భామ తాజాగా చెప్పిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .
అభిమానం హద్దులు దాటితే అది ఎలా ఉంటుందో చెబుతూ తనకు జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ ని ఇప్పుడు బయట పెట్టింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ షూటింగ్ టైంలో  తనకి ఎదురైన అనుభవాన్ని ఇలా చెప్పుకొచ్చింది.

రావడం రావడమే అబ్బాయి తన షర్టు విప్పేసి

Advertisement

అది ఒక సినిమా షూటింగ్ ఫస్ట్ డే నే అది జరిగిందని తెలిపింది .ఆరోజు షూటింగ్ కంప్లీట్ అయ్యాక తన కార్వాన్ లో ఒంటరిగా రెస్ట్ తీసుకుంటున్నాను అని అయితే అప్పుడే ఒక వ్యక్తి లోపలికి వచ్చాడని పర్మిషన్ లేకుండా సడెన్ గా దూసుకు వచ్చాడని చెప్పుకొచ్చింది .దాంతో ఒక్కసారిగా తాను భయభ్రాంతులకు గురయ్యానని తెలిపింది.అయితే ఆ తర్వాత అతను ఆ సినిమాకి పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ అని తెలిసింది అని వాపోయింది.
ఇక రావడం రావడమే అబ్బాయి తన షర్టు విప్పేసి తన ఒంటిపై ఉన్న కాజల్ అనే పేరు గల టాటూ ని చూపించాడని, నేను మీ అభిమానిని అందువల్లే ఇలా టాటూ వేయించుకున్నానని చెప్పాడని తెలిపింది.

Also read :బుట్టబొమ్మకు బ్యాడ్ టైమ్.. ఇక కమ్‌బ్యాక్ కష్టమేనా..?

Advertisement

ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్

అయితే అభిమానం ఉండొచ్చు కానీ అది హద్దులు దాటకూడదు అని ఆ భయంతో ఒక్కసారిగా షాక్ అయ్యానని కాసేపు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదని ఆరోజు జరిగిన ఇన్సిడెంట్ ని గుర్తుచేసుకుంది కాజల్.ఒకరి వ్యక్తిగత స్పేస్ లోకి అనుమతి లేకుండా రావడం చాలా తప్పని కాజల్ మాటల్లో స్పష్టంగా కనిపించింది .
ఇక ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. చాలామంది నెటిజన్లు కూడా సెలబ్రిటీలకి ప్రైవసీ ఎంత ముఖ్యమో ఇలాంటి ఘటనలు ప్రూవ్ చేస్తున్నాయి అంటూ సోషల్ ఇక సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

2007లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో

కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే 2007లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 2009లో వచ్చిన మగధీరతో ఒక్కసారిగా స్టార్ లీగ్ లోకి దూసుకుపోయింది. ఇక ఆ తర్వాత వరుసగా డార్లింగ్ ,మిస్టర్ ఫర్ఫెక్ట్ ,బృందావనం బిజినెస్ మాన్, నాయక్, బాద్షా, టెంపర్ ,ఖైదీ నెంబర్ 150 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది . ఒక దశలో ప్రతి స్టార్ హీరోల సినిమాలో కాజలే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే కాజల్ ఏ రేంజ్ లో ఒక ఊపు ఊపింది అర్థమవుతుంది.

ఎలాంటి కేరింగ్ తీసుకుంటారో !

ఇక 2020 అక్టోబర్ 30న తన ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న కాజల్ 2022లో నీల్ జన్మనిచ్చింది.అయితే పెళ్లి పిల్లల తర్వాత కెరీర్ ఎండ్ చేస్తుందనుకున్న ఈ భామ ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టి అదే జోష్ ని కంటిన్యూ చేస్తుంది.

ఈ క్రమంలోనే బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాని చేసిన కాజల్ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న nbk 111 లోను కీలకపాత్రలో కనిపిస్తోంది. మరోవైపు భారీ బడ్జెట్ తో వస్తున్న రామాయణంలో మండోదరి పాత్ర పోషిస్తున్న కాజల్ తాజాగా ది ఇండియా స్టోరీ అనే సోషల్ ఓరియెంటెడ్ ఫిలిమ్ లో లాయర్ పాత్రలో కనిపించింది.ఏది ఏమైనా కాజల్ చెప్పిన ఈ కార్వాన్ ఇన్సిడెంట్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చూడాలి ముందు ముందు ఈ ఘటనలు జరగకుండా ఇండస్ట్రీలో ఎలాంటి కేరింగ్ తీసుకుంటారో !

Related News

ప్రభాస్ శ్రీను జీవితాన్ని మార్చేసిన శరత్ బాబు.. అసలు కథ ఇదే!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ స్టార్‌గా.. ప్రగతి సెన్సేషన్!

బుట్టబొమ్మకు బ్యాడ్ టైమ్.. ఇక కమ్‌బ్యాక్ కష్టమేనా..?

మురుగదాస్, మణిరత్నం.. ఇప్పుడు రమేష్ వర్మ! ధ్రువ్ విక్రమ్ మళ్లీ సేమ్ సీన్ రిపీట్?

‘చెన్నై లవ్ స్టోరీ’కి షాకింగ్ ట్విస్ట్.. OTT డీల్‌లో ఏం జరిగింది?

సంక్రాంతి రేస్ నుండి బాలయ్య అవుట్? NBK 111 రిలీజ్ వాయిదా వెనుక అసలు నిజం!

మంగళవారం సీక్వెల్ పై డైరెక్టర్ బిగ్ అప్డేట్.. ఈసారి అంతకుమించి అంటూ!

Big Stories

Advertisement
×