E-Paper
Advertisement

Kalki 2: కల్కి2లో సుప్రీమ్ యాస్కిన్ విశ్వరూపం.. ఏకంగా 90 నిమిషాల పాటూ?

Kalki 2: కల్కి2లో సుప్రీమ్ యాస్కిన్ విశ్వరూపం.. ఏకంగా 90 నిమిషాల పాటూ?
Advertisement

Kalki 2:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే, ఆ సినిమా ముగింపులో అసలైన ఆశ్చర్యం కలిగించిన పాత్ర ‘సుప్రీమ్ యాస్కిన్’. లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) పోషించిన ఈ విలక్షణమైన పాత్ర కారణంగా ఇప్పుడు రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్-2లో కమల్ హాసన్ కేవలం అతిథి పాత్రకే పరిమితం కాకుండా, తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

90 నిమిషాల స్క్రీన్ టైమ్.. కథ మొత్తం ఆయన చుట్టూనే:

కల్కి మొదటి భాగంలో కమల్ హాసన్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఆ కొద్ది నిమిషాల్లోనే ఆయన చూపించిన ఇంపాక్ట్ మామూలుగా లేదు. అయితే, ‘కల్కి 2’లో సుప్రీమ్ యాస్కిన్ పాత్రే కీలకం కాబోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ రెండో భాగంలో కమల్ హాసన్ ఏకంగా 90 నిమిషాల పాటు స్క్రీన్ పై కనిపిస్తారట. అంటే సినిమా కథలో దాదాపు సగం సమయం ఆయన చుట్టూనే తిరుగుతుంది. మొదటి భాగంలో కేవలం ఒకే చోట కూర్చుని కనిపించిన యాస్కిన్, రెండో భాగంలో తన అసలైన ప్రతాపాన్ని, విధ్వంసాన్ని చూపించబోతున్నారని తెలుస్తోంది.

రెండు షాకింగ్ లుక్స్.. సరికొత్త గెటప్‌లో కమల్:

Advertisement

కమల్ హాసన్ అంటేనే ప్రయోగాలకు మారుపేరు. మొదటి భాగంలో ఆయన ముసలివాడిగా, వింతైన రూపంలో కనిపించి అందరినీ షాక్ కు గురిచేశారు. అయితే, సీక్వెల్ లో ఆయన గెటప్ మారబోతోందని ప్రచారం జరుగుతోంది. గాండీవాన్ని చేతబట్టి, శక్తులను పొందిన తర్వాత యాస్కిన్ లుక్ మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందట. కేవలం ముసలి గెటప్ మాత్రమే కాకుండా, కథా క్రమంలో వచ్చే మార్పుల వల్ల మరో డిఫరెంట్ లుక్ లో కూడా కమల్ హాసన్ కనిపించబోతున్నారని సమాచారం. ఈ ‘డ్యూయల్ షేడ్’ విలనిజం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయం.

ALSO READ:Varanasi: వారణాసి కోసం నన్నే మార్చేశారు..రాజమౌళిపై మహేష్ బాబు కామెంట్స్..!

నెల రోజులపాటు ప్రత్యేక షూటింగ్..

Advertisement

ఈ అద్భుత దృశ్యాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు నాగ అశ్విన్ భారీ ప్లాన్ సిద్ధం చేశారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ‘కల్కి 2’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో పూర్తిగా కమల్ హాసన్ పైనే కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ షూటింగ్‌లో యాస్కిన్ కు సంబంధించిన ప్రధాన యాక్షన్ పార్ట్ మరియు డైలాగ్ సీన్స్ పూర్తి చేయనున్నారు.

విధ్వంసం సృష్టించిన కమలహాసన్..

మొదటి భాగం కేవలం పునాది మాత్రమే అయితే, రెండో భాగం అసలైన యుద్ధంలా ఉండబోతోంది. కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడికి 90 నిమిషాల సమయం కేటాయించటం, ఇక కర్ణుడిగా ప్రభాస్ నటన, ఇలా ఎన్నో ప్రత్యేకతలు మూవీ పైన అంచనాలు పెంచేస్తున్నాయి.ఇక మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×