Kalki 2:రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) హీరోగా ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ రికార్డులు సృష్టించిన చిత్రం కల్కి 2898AD. ఈ చిత్రానికి కొనసాగింపుగా సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. పైగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా కొత్త ప్రాజెక్టులు ప్రకటించకుండా దీనిపైనే కష్టపడుతున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి కొత్త అప్డేట్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూసిన అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ లభించింది. నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో షూటింగ్ సెట్ లోని కొంత భాగాన్ని షేర్ చేస్తూ ప్రభాస్ కి స్పెషల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది చిత్ర బృందం.
మొదటి భాగంలో భైరవ పాత్రలో ప్రభాస్ చూపించిన విన్యాసాలు, తెరపై ఆయన ప్రదర్శన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రెండవ భాగంలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఇప్పుడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో సినిమా నిర్మాణం పై అభిమానులలో మరింత ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా విడుదల చేసిన వీడియోలో కూడా ప్రభాస్ భైరవ పాత్రలో మరోసారి ఆడియన్స్ ను ఆకట్టుకోబోతున్నారు. మరి విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సీక్వెల్ ఇంకెలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
also read:ప్రభాస్ కి జపాన్ ఆడియన్స్ స్పెషల్ సర్ప్రైజ్.. వీడియో వైరల్!
ఈ భారీ విజువల్ వండర్ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఇకపోతే తొలి భాగంలో కనిపించిన అద్భుతమైన ప్రపంచాన్ని మరింత విస్తరించేలా రెండో భాగాన్ని రూపొందించనున్నారు అని తెలుస్తోంది. ఇకపోతే మొదటి భాగంలో సుమతి పాత్రలో దీపికా పదుకొనే నటించగా.. ఆమెను తప్పించి ఆమె స్థానంలో సాయి పల్లవిని తీసుకున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక మరోవైపు ప్రభాస్, కమలహాసన్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖ నటీనటులు ఈ ప్రాజెక్టులో కొనసాగబోతున్నారు. కథలోని కీలక మలుపులు , ప్రధాన పాత్రల మధ్య సంబంధాలు, భవిష్యత్తు ప్రపంచం నేపథ్యంలో సాగే సంఘటనలు రెండో భాగంలో ఎలా ఉండబోతున్నాయి అనే విషయంపై అభిమానులలో చర్చ మొదలయ్యింది.. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా అంతకుమించి ఉంటుందనే కామెంట్లైతే వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు సీతారామం సినిమాతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ నుండి ఈరోజు ఉదయం ఒక పోస్టర్ రిలీజ్ చేయగా.. ఈరోజు సాయంత్రం అదిరిపోయే అప్డేట్ ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏదిఏమైనా పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న ప్రభాస్ ఎప్పటికప్పుడు తన అద్భుతమైన నటనతో, చిత్రాలతో భారీ ప్రేక్షక గణాన్ని అభిమానగణంగా మార్చుకుంటున్నారు అని చెప్పవచ్చు.