E-Paper
Advertisement

ప్రభాస్ కి జపాన్ ఆడియన్స్ స్పెషల్ సర్ప్రైజ్.. వీడియో వైరల్!

ప్రభాస్ కి జపాన్ ఆడియన్స్ స్పెషల్ సర్ప్రైజ్.. వీడియో వైరల్!
Advertisement

Actor Prabhas:ఇండియాలో విడుదలయ్యే దాదాపు చాలా సినిమాలు అటు జపాన్ లో విడుదలవుతూ.. సెలబ్రిటీలకు జపాన్ ఆడియన్స్ ను దగ్గర చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ రజనీకాంత్ (Rajinikanth), ఎన్టీఆర్ (NTR ) అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan) లాంటి హీరోలకి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఆ జాబితాలో ప్రభాస్ (Prabhas) కూడా చేరిపోయారన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్ సినిమాల కోసం అక్కడి ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ఆయన సినిమాలను చూడడానికి ఇండియాకి వస్తాం అంటూ అప్పుడప్పుడు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి జపాన్ అభిమానులు నేడు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఒక వీడియో షేర్ చేశారు.

ప్రభాస్ కి జపాన్ ఫ్యాన్స్ స్పెషల్ విషెస్..

పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ పుట్టినరోజు ఈరోజు. ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో ఇండియాలో మొదలుకొని ఇతర దేశాలలోని అభిమానులు కూడా ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా జపాన్ ఫాన్స్ ఆయనకు ఒక వీడియోతో స్పెషల్ సర్ప్రైజ్ విషెస్ చెప్పడం గమనార్హం. రెబల్ స్టార్ ఫోటోలతో కేక్ కట్ చేసి బర్తడే పాట పాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

జపాన్ కి రండి..

Advertisement

గతంలో ప్రభాస్ జపాన్ కు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ..” మళ్లీ మీరు జపాన్ కి రండి” అంటూ విజ్ఞప్తి చేశారు .అంతేకాదు ఆయన కొత్త సినిమాలను చూసేందుకు భారత్ కి రావాలని ఉంది అని తమ సందేశంలో పేర్కొనడం గమనార్హం.. మొత్తానికైతే జపాన్ అభిమానులు ప్రభాస్ కి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ చెప్పిన ఈ విషెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఇక్కడ మరో స్పెషల్ ఏమిటంటే.. ఈ జపాన్ అభిమానులు తెలుగులో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా చివరిలో బాహుబలి అంటూ నినాదాలు చేయడం అందరిని ఆకట్టుకుంది. మొత్తానికైతే ఈ అభిమానులు ఆయనపై చూపించిన అభిమానానికి ఇటు ప్రభాస్ అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.

also read:నరేష్ కి బిగ్ బాస్ అన్యాయం.. ఆ ముగ్గురే విజేతలు!

వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..

Advertisement

ఇకపోతే ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో అభిమానుల నుంచే కాకుండా సెలబ్రిటీల నుండి ప్రభాస్ కి స్పెషల్ పుట్టినరోజు విషెస్ లభిస్తున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ మారుతి, హీరో ఆది సాయికుమార్, డైరెక్టర్ మెహర్ రమేష్, యంగ్ హీరో నారా రోహిత్ తో పాటు పలువురు సెలబ్రిటీలు ప్రభాస్ కి స్పెషల్ విషెస్ చెబుతూ ఆయనపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Related News

ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. కల్కి 2 నుండి ఆకట్టుకుంటున్న అప్డేట్!

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూత!

విజయ్ దేవరకొండకు ఇంకా ఎంత రావాలంటే.. రణబాలి లెక్క ఇదే!

వెంకీ సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.. రచ్చకు రెడీనా!

గ్లామర్ షోతో కాదు.. సింపుల్ లుక్‌తోనే మ్యాజిక్ చేసిన సాన్యా!

రాజకీయాల్లోకి వెళ్లి ఆస్తులన్నీ పోగొట్టుకున్నా.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

బొబ్బిలి రాజా తర్వాత నా కెరీర్‌లో ఏం జరిగిందంటే.. శివాజీరాజా కామెంట్స్

Big Stories

Advertisement
×