E-Paper
Advertisement

భారీ బ్యాటరీ, ఐఫోన్ లాంటి డిజైన్.. సామాన్యుల కోసం టెక్నో పవర్‌ఫుల్ 5G మొబైల్!

భారీ బ్యాటరీ, ఐఫోన్ లాంటి డిజైన్.. సామాన్యుల కోసం టెక్నో పవర్‌ఫుల్ 5G మొబైల్!
Advertisement

Tecno POP X 5G: తక్కువ ధరలో మంచి 5G ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే టెక్నో కంపెనీ ఇలాంటి వారి కోసమే బెస్ట్ ఆప్షన్ తీసుకొచ్చింది. స్టైలిష్ లుక్, అంతకు మించి పవర్‌ఫుల్ ఫీచర్లతో TECNO Pop X 5Gని ఇండియాలో లాంచ్ చేసింది. కేవలం ధర మాత్రమే కాదు.. దీని ఫీచర్లు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

చూడగానే నచ్చేసే ఐఫోన్ స్టైల్..

ఈ ఫోన్‌ను మొదటిసారి చూడగానే అచ్చం ఐఫోన్ లాగే అనిపిస్తుంది. ముఖ్యంగా వెనుక వైపు ఉన్న కెమెరా డిజైన్ ఫోన్‌కు ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ఇది కేవలం అందానికే కాదు.. గట్టిదనానికి కూడా కేరాఫ్ అడ్రస్. ఎందుకంటే.. దీనిని ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేశారు. ఫోన్ చాలా స్లిమ్‌గా ఉండటమే కాకుండా.. దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్ ఇచ్చారు. దీంతో ఫోన్ వాడుతున్నప్పుడు చాలా స్మూత్‌గా, స్పీడ్‌గా అనిపిస్తుంది.

రఫ్ అండ్ టఫ్‌గా వాడుకోవచ్చు..

Advertisement

సాధారణంగా తక్కువ ధరలో వచ్చే ఫోన్ల విషయంలో మనకు ఒక భయం ఉంటుంది. ఎక్కడ నీళ్లలో పడిపోతుందో లేదంటే కింద పడితే పగిలిపోతుందో అని. కానీ టెక్నో ఆ భయం లేకుండా చేసింది. ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఉండటం వలన వర్షంలో తడిచినా, దుమ్ము పడినా ఏమీ కాదు. అంతేకాదు.. పొరపాటున చేయి జారి కిందపడినా తట్టుకునేలా దీనిని డిజైన్ చేశారు.

Also Read: పర్పుల్ లుక్‌, 10,000mAh భారీ బ్యాటరీ.. అబ్బా ఏముంది మావా ఈ Vivo Y600 Pro స్మార్ట్‌ఫోన్!

ఛార్జింగ్ టెన్షన్ లేదిక..

Advertisement

ఈ TECNO Pop X 5Gలో ఏకంగా 6500 mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. రెండు రోజుల పాటు అసలు ఛార్జింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఇక 5G విషయానికి వస్తే.. దీనిలో వాడిన టెక్నాలజీ వల్ల ఇంటర్నెట్ స్పీడ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.

స్మార్ట్ AI ఫీచర్లు..

ఇప్పుడంతా AI మేనియానే కదా. అందుకే టెక్నో ఈ ఫోన్‌లో కొన్ని క్రేజీ ఫీచర్లను పెట్టింది. కాల్ మాట్లాడేటప్పుడు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఉండటం, ఫొటోలను ఈజీగా ఎడిట్ చేసుకోవడం వంటివి మనకు బాగా ఉపయోగపడతాయి. ఇక నెట్‌వర్క్ లేని చోట కూడా దగ్గర్లోని డివైజ్‌లతో కమ్యూనికేట్ చేయడానికి దీనిలో ఫ్రీలింక్ అనే కొత్త ఫీచర్‌ను కూడా పరిచయం చేశారు.

ధర ఎంత ఉండొచ్చు?

ఇక అసలు విషయానికి వస్తే.. టెక్నో పాప్ X 5G రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB+128GB వేరియంట్ ధర రూ.15,999 కాగా.. 6GB+128GB వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. ఈ నెల 24 నుంచి సేల్స్‌లో దొరుకుతుంది. మంచి లుక్ ఉండి.. బ్యాటరీ లైఫ్ ఎక్కువగా కావాలనుకునే వారికి ఇది పక్కా బడ్జెట్ మొబైల్ అని చెప్పొచ్చు.

Also Read: ఫోన్ కొంటే ఇయర్‌బడ్స్ ఫ్రీ.. Ai Plus Nova 2 Ultra 5Gపై క్రేజీ ఆఫర్, పూర్తి వివరాలివే!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×