Biker Movie:యంగ్ ఛార్మింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ కెరియర్ మొదటి నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక అలాంటిది ఈయన తాజాగా స్పోర్ట్స్ డ్రామా బైకర్ మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అటు స్పోర్ట్స్ డ్రామా ఇటు తండ్రి కొడుకుల ఎమోషన్ సినిమాకు ప్లస్ గా నిలిచాయి.అలా ఈ సినిమా మొదటి నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం గమనార్హం. ఇండియాస్ ఫస్ట్ మోటో క్రాస్ అడ్వెంచర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో రేసింగ్ యాక్షన్ సీక్వెన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే అలాంటి ఈ సినిమా ఇప్పుడు నెల తిరగకుండానే ఓటీటీలోకి రావడానికి సిద్ధమయ్యింది. మరి ఎక్కడ ? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బైకర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక మే ఒకటవ తేదీన తెలుగుతోపాటు వివిధ భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నారు. శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించగా.. తండ్రి బుల్లెట్ సునీల్ పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించారు . బ్రహ్మాజీ , అతుల్ కులకర్ణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తానికి అయితే ఇప్పుడు సమ్మర్ స్పెషల్ గా నెల తిరగకుండానే ఓటీటీలోకి రాబోతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:మరోసారి తండ్రి అయిన డైరెక్టర్ అట్లీ.. పోస్ట్ వైరల్!
బైకర్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. బుల్లెట్ సునీల్ (రాజశేఖర్) మాజీ మోటో క్రాస్ రేసర్.. అయితే ఇండియాలో కూడా మోటో క్రాస్ రేసింగ్ కి గుర్తింపు తీసుకురావాలనేదే ఆయన కల. దీనిని నెరవేర్చుకునే క్రమంలో మోటో క్రాస్ రేసర్లను తీర్చిదిద్దే పనిలో ఉంటాడు. తండ్రి దగ్గరే రేసింగ్ కోచింగ్ తీసుకొని మోటో క్రాస్ రేసర్గా రాటు తేలుతాడు విక్కీ (శర్వానంద్). తండ్రి డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసేందుకు ఇంటర్నేషనల్ స్థాయి రేసింగ్ లో కూడా పాల్గొంటాడు. కానీ ట్రాక్ పై జరిగిన కొన్ని పరిణామాలతో మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దీంతో విక్కి అనూహ్యంగా రేసింగ్ కి కూడా దూరం కావాలని నిర్ణయించుకొని.. తండ్రికి కూడా దూరంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనూహ్యంగా ఒక రేసింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతాడు. అసలు తండ్రి కొడుకుల మధ్య దూరం పెరగడానికి కారణం ఏమిటి ? రేసింగ్ కి దూరంగా వెళ్లిపోయిన విక్కి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు? తండ్రి కొడుకులు కలిసారా? అసలు తండ్రి డ్రీమ్ ని కొడుకు ఫుల్ ఫీల్ చేశాడా ? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ఇక థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.