E-Paper
Advertisement

కర్ణాటకలో ఓకే.. మరి తమిళనాడులో ఎందుకు కాదు? గవర్నర్‌ను నిలదీసిన హీరో విశాల్!

కర్ణాటకలో ఓకే.. మరి తమిళనాడులో ఎందుకు కాదు? గవర్నర్‌ను నిలదీసిన హీరో విశాల్!
Advertisement

Kollywood  support: తమిళ నాట TVK పార్టీ పెట్టి అనూహ్యంగా విజయడంకా మోగించిన దళపతి అంత ఈజీగా సీయం పీటంపై కూర్చునేలా కనిపించట్లేదు.అధికారం అందుకోవడానికి మరో 5 సీట్లకి దూరంగా ఉండిపోయాడు విజయ్. అయితే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలని, అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని విజయ్ చేసిన రిక్వెస్ట్ ని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తోసిపుచ్చడంతో ఫైర్ అవుతున్నారు కోలీవుడ్ స్టార్స్.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే

Advertisement

ఈ క్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ “ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్నేతలని, ఏరి కోరి తమిళ ప్రజలు విజయ్ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున పట్టం కట్టారు కాబట్టి ఖచ్చితంగా 108 సీట్లు సాధించిన విజయ్‌కు తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని తేల్చి చెప్పాడు.ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని,అయినా”మెజారిటీని అసెంబ్లీ లో నిరూపించుకోవాలి కానీ, రాజ్ భవనం గోడల మధ్య కాదు” అంటూ కుండ బద్దలు కొట్టేశాడు.ఎస్.ఆర్. బొమ్మై కేసులో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని,గెలిచిన 233 మంది MLAలు ఇప్పటికీ ప్రమాణస్వీకారం చేయకపోవడం రాష్ట్రానికే అవమానకరమని తన మనసులోని మాటని బయటపెట్టాడు

గవర్నర్ తీరు అసహ్యకరం

Advertisement

ఇక ఇదే విషయంపై వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో మాట్లాడుతూ “ప్రజలు ఎన్నుకున్న నేతను సింహాసనం ఎక్కకుండా అడ్డుకోవడం రాజకీయ కక్షసాధింపు చర్యే అంటూ విమర్శలు చేశాడు.గవర్నర్ ఒక వ్యవస్థలా కాకుండా ఒక పార్టీ ప్రతినిధిలా ఉన్నట్టు కనిపిస్తోంది. విజయ్‌కు ఉన్న ప్రజా మద్దతును చూసి భయపడే ఇలాంటి చీప్ పాలిటిక్స్ కి తెరతీస్తున్నారంటూ ‘ఎక్స్’ లో ఫైర్ అయ్యాడు.

ALSO READ :ఇండస్ట్రీ నుంచి క్లీన్ స్వీప్.. పోసానిని దూరం పెట్టిన మేకర్స్.. కారణం అదేనా?

విజయ్ ఖచ్చితంగా సీఎం అవుతారు

ఇక వీరి సంగతి ఇలా ఉంటె హీరో విశాల్ ఒక అడుగు ముందుకు వేసి డైరెక్ట్ గా గవర్నర్ కే తన ప్రశ్నని సందించాడు.. గతంలో గోవా, మణిపూర్, మేఘాలయ మరియు ముఖ్యంగా కర్ణాటకలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ..ఆ రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీని పిలిచి ‘ఫ్లోర్ టెస్ట్’ (బలనిరూపణ) ద్వారా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చారని విశాల్ గుర్తు చేశారు. విజయ్ (Thalapathy Vijay) నేతృత్వంలోని TVK (తమిళ వెట్రి కజగం) పార్టీకి ప్రజలు ఇంత పెద్ద ఎత్తున పట్టం కట్టినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ తనదైన శైలిలో బాణాలని సందించాడు విశాల్.ఒక సామాన్య ఓటరుగా తాను విజయ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని, విజయ్ ని అడ్డుకునే ఏ శక్తిని తమిళ ప్రజలు క్షమించరని హెచ్చరించాడు .

ఉత్కంఠ పెంచుతున్న పరిణామాలు
ఇక హీరోల పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు టెక్నీషియన్లు కూడా విజయ్‌కు సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలపడం విశేషం. ఒకవేళ గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, టీవీకే సుప్రీంకోర్టును వెళ్లేందుకు సిద్ధమవుతోందని సమాచారం.మొతానికి ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్నఈ సపోర్ట్ విజయ్ కి మరింత బూస్టప్ ఇస్తుందనే చెప్పాలి. మరి ఇప్పటికైనా గవర్నర్ విజయ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తాడా ..లేక అదే మంకు పట్టుతో ఉంటాడా అన్నది వేచి చూడాల్సిందే !

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×