E-Paper
Advertisement

ఇండస్ట్రీ నుంచి క్లీన్ స్వీప్.. పోసానిని దూరం పెట్టిన మేకర్స్.. కారణం అదేనా?

ఇండస్ట్రీ నుంచి క్లీన్ స్వీప్.. పోసానిని దూరం పెట్టిన మేకర్స్.. కారణం అదేనా?
Advertisement

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి…ఈపేరొక ఫైర్ బ్రాండ్. రైటర్ గా 100సినిమాలు చేసినా రాని గుర్తింపు పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకోవడంతో అమాంతం వచ్చి పడింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పనిచేసిన పోసాని పవన్ తో పాటు చంద్రబాబు, లోకేష్‌లపై బూతులతో ఏరకంగా రెచ్చిపోయాడో మనం చూశాం.ఫలితంగా కూటమి అధికారంలోకి వచ్చాక జైలు బాట పట్టాడు కూడా.అలా గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి, అటు పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉండిపోయిన పోసాని ఇప్పుడు నేనున్నాను బాబోయ్ అని చెప్పుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాడు. ఆక్రమంలోనే ఇప్పుడు సడన్‌గా మీడియా ముందుకు రావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

చేతులెత్తి దండం పెట్టేసిన పోసాని 

Advertisement

చాలా కాలం అజ్ఞాతవాసంలో ఉన్న పోసాని, తాజాగా మే 7, 2026 (ఈరోజే)మీడియా ముందుకు వచ్చి తన స్వంత దర్శకత్వంలో‘ఆపరేషన్ అరుణా రెడ్డి’ అనే సినిమాను అనౌన్స్ చేశారు.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియా ముందుకు వచ్చిన పోసానిలో మునుపటిలా ‘గర్వం’ ఎక్కడా కనిపించకపోవడం విశేషం. మీడియా పొలిటికల్ ప్రశ్నలు వేస్తే మళ్లీ ఇరకాటంలో పడతానని ఆయనకు బాగా తెలుసు కూడా.అందుకే రాగానే, “ఇది సినిమా ప్రెస్ మీట్.. పొలిటికల్ ప్రెస్ మీట్ కాదు.. నన్ను రోడ్డుపైకి లాగొద్దు” అంటూ ముందుగానే చేతులెత్తి దండం పెట్టేయడం చూస్తుంటే గతం తాలూకు జ్ఞాపకాలు ఏ రేంజ్ లో వెంటాడుతున్నాయో అర్థమవుతుంది. గతంలో ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేసిన పోసాని , ఇప్పుడు కేవలం ఒక సాధారణ నటుడిగా, దర్శకుడిగా తనను క్షమించి సినిమాలు చేసుకోనివ్వమని వేడుకోవడం ఇక్కడ గమనార్హం.

also read: పుష్ప 2 విషాదం.. శ్రీతేజ్ ని పరామర్శించిన స్నేహరెడ్డి..వీడియో వైరల్ !

Advertisement

ఇండస్ట్రీ నుండి టోటల్ గా ఎగ్జిట్ ఇచ్చాడా

అధికారం ఉంది కదా అని అడ్డూ అదుపులేకుండా మాట్లాడితే  కాలం ఎలా బుద్ధి చెబుతుందో పోసాని ప్రస్తుత పరిస్థితే నిదర్శనం. ఇండస్ట్రీ పెద్దలందరూ ఆయనను దూరం పెట్టారు. ఒకప్పుడు వరుస ఆఫర్లు ఇచ్చిన దర్శకులు ఇప్పుడు పోసాని పేరు వినపడితేనే ‘నో’ అనే పరిస్థితి.ఒకానొక దశలో ఇండస్ట్రీ నుండి టోటల్ గా ఎగ్జిట్ ఇచ్చాడా అన్న డిస్కషన్ కూడా జోరుగా నడిచింది. మొత్తానికి ఇక తనకు బయట ఎక్కడా అవకాశాలు రావు అని కన్ఫామ్ అయ్యాకే కాబోలు మరో మార్గం లేక తన సొంత డబ్బులతో ఈ సాహసం చేసినట్టు కనిపిస్తోంది. పక్కా జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్నఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడట పోసాని. అయితే, గత కొంతకాలంగా చిన్న పాత్రలకే పరిమితమైన పోసానిని, సోలోగా చూడటానికి ఆడియన్స్ థియేటర్లకు వస్తారా? అంటే అనుమానమే.ఆపరేషన్ దుర్యోధన లాంటి సాలిడ్ కంటెంట్ డెలివర్ చేస్తే మాత్రం ఇండస్ట్రీలో పోసాని పేరు మళ్ళీ వినిపించడం ఖాయం.

సినిమాలతో బిజీ అవుతారా లేక

ycp పార్టీకి సానుభూతిపరుడిగా మారిన పోసాని , ఆ పార్టీ కోసం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అధికారంలో ఉనప్పుడు  పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలపై బార్డర్స్ దాటి బూతులతో రెచ్చిపోవడం అప్పట్లో ఒక సెన్సేషన్.ఫలితమే .. ఫిబ్రవరి 2025లో ఆయనపై నమోదైన కేసులు.ఇక కడప జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వల్ల ఆయన కొంతకాలం రిమాండ్‌లో కూడా ఉండాల్సి వచ్చింది.మరి ఇప్పటికైనా ఆ పొలిటికల్ రొంపికి బాయ్ బాయ్ చెప్పేసి సినిమాలతో బిజీ అవుతారా లేక ఎప్పటిలాగే మళ్ళీ నోటికి పని చెప్పి కెరీర్ కి పూర్తిగా ఎండ్ కార్డ్ వేసుకుంటారా చూడాలి  !

also read: నిన్ను కోరి’ రీ-రిలీజ్ హంగామా.. పాత జ్ఞాపకాలు బయటపెట్టిన ఆది పినిశెట్టి

 

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×