E-Paper
Advertisement

Kamal Haasan: పాలిటిక్స్‌లో పెద్దోడు.. సినిమాల్లో చిన్నోడు.. చిరుపై కమల్ జోక్స్!

Kamal Haasan: పాలిటిక్స్‌లో పెద్దోడు.. సినిమాల్లో చిన్నోడు.. చిరుపై కమల్ జోక్స్!
Advertisement

Kamal Haasan: ఆయన రాజకీయాల్లో నాకు సీనియర్, సినిమాలో నాకు జూనియర్. మేము 70వ దశకంలో లీడ్ రోల్ యాక్టర్స్.. అంటూ సరదాగా జోక్స్ వేశారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. తాజాగా జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేడుకలో పైడి జయరాజ్ అవార్డును కమల్ హాసన్ స్వీకరించారు. అవార్డును స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముందుగా సింగితం శ్రీనివాసరావుకు వచ్చిన అవార్డును ఆయన గైర్హాజరు కావడంతో అది కూడా కమల్ హాసనే అందుకున్నారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ..

‘‘నాకు తెలిసి ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. నేను మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నా వయసు 16 ఏళ్లు. అక్కినేని నాగేశ్వరరావు గారి ‘శ్రీమంతుడు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయడానికి వచ్చాను. అందుకే నా ‘దశావతారం’ సినిమాలో కూడా ‘ఎంతో చిన్నది జీవితం’ అనే పాట వినిపిస్తుంది. నేను, నాకు 16 ఏళ్ల వయసు నుంచి హైదరాబాద్‌లో పని చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఎందరో మహానుభావులకు, అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

Advertisement

నేను సింగీతం శ్రీనివాసరావుకి వచ్చిన అవార్డు అందుకుంటున్నప్పుడు, ఆయనతో నేను చేసిన మొదటి సినిమా ‘సొమ్మొకడిది సోకొకడిది’ గుర్తుకు వచ్చింది. ఆ సినిమా పనంతా సింగీతం గారే చేశారు, కానీ అవార్డు మాత్రం నాకు వచ్చింది. మేము ఇద్దరం కలిసి దాదాపు 50 ఏళ్లుగా పని చేస్తున్నాము. ఆయన అంటే నాకు ఇష్టం.. కేవలం ఆయన పేరు నా తండ్రి పేరు (శ్రీనివాసన్) లాగా ఉంటుందని కాదు, నా సినిమా కెరీర్‌లో నేను చూసిన అత్యంత యంగెస్ట్ సీనియర్ ఆయనే. థాంక్యూ సీఎం సార్, ఆయనకు మీరు ఇచ్చిన ఈ గౌరవానికి మేమంతా గర్వపడుతున్నాము. ఆ సినిమాలో జయసుధ కూడా నాతో కలిసి పని చేశారు. ఇది చాలా పెద్ద కథలే.

ఇక చిరంజీవి గారు, నేను.. మేమిద్దరం సోదరులం. ఆయన రాజకీయాల్లో నాకు సీనియర్, సినిమాలో నాకు జూనియర్. మేము 70వ దశకంలో లీడ్ రోల్ యాక్టర్స్ అయ్యాము. ఇప్పుడు కూడా మేము 70లోనే ఉన్నాం.. అంటే అది సినిమా గురించి కాదు, మా వయసు గురించి చెబుతున్నాను. సారీ చిరంజీవి గారు, నిజం చెప్పాలి కదా!’’ అంటూ చిరుపై సరదాగా సంభాషించారు.

Related News

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

Big Stories

Advertisement
×