Kamal Haasan: ఇకపై టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, శాండల్‌వుడ్ అనే తేడాలు ఉండకూడదు.. ఇదంతా ఒకటే సినిమా.. అదే ‘ఇండియన్ సినిమా’. దీని కోసం తపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉంటామని అన్నారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో పైడి జయరాజ్ అవార్డును అందుకున్న ఆయన మాట్లాడుతూ..
‘‘గద్దర్ గారి పేరు మీద ఈ అవార్డును నెలకొల్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు (గద్దర్ గారికి) లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, అందులో నేను కూడా ఒకడిని. తెలంగాణ గడ్డపై ఈరోజు డప్పులు అంత ఎత్తున మోగుతుండడం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. 45 ఏళ్ల క్రితం ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అప్పట్లో నేను ఇక్కడే హైదరాబాద్‌లో ఉన్నాను. ఒక కవికి, ఒక విప్లవకారుడికి (గద్దర్ గారికి) సీఎం అందిస్తున్న ఈ గౌరవం నిజంగా అభినందనీయం. ఆయనను మీరు మొదటగా గౌరవించినప్పుడే, మేమందరం గౌరవించబడినట్లుగా భావిస్తున్నాము. మేమంతా ఆయనకు పెద్ద అభిమానులం, అందుకు మీకు ధన్యవాదాలు సార్.
Also Read- Kamal Haasan: పాలిటిక్స్‌లో పెద్దోడు.. సినిమాల్లో చిన్నోడు.. చిరుపై కమల్ జోక్స్!
నేను ఈ స్థాయికి రావడానికి ఎందరో సహాయం చేశారు. నేను కూడా చాలా సార్లు తడబడ్డాను, ఇందాక స్టేజీ మెట్లు ఎక్కుతున్నప్పుడు తడబడినట్లే. చిరంజీవికి గానీ, నాకు గానీ ఏదీ అంత తేలికగా రాలేదు, ఆయన కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని (రేవంత్ రెడ్డి) ఒక విన్నపం కోరుతున్నాను. ఎందుకంటే, ఈ ఐక్యతకు మీరే హీరో. ఇకపై టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, శాండల్‌వుడ్ అనే తేడాలు ఉండకూడదు.. ఇదంతా ఒకటే సినిమా.. అదే ‘ఇండియన్ సినిమా’. మీరు ఆ ప్రాంతీయ సరిహద్దులను చెరిపివేశారు. మీరు దీనిని ప్రారంభించారు, మేము మీకు తోడుగా ఉంటాం, మద్దతు ఇస్తాం. రేపటి తరాన్ని సినిమా ఊరేగింపులో ముందుకు తీసుకెళ్లే పల్లకికి మేము భుజం ఇస్తాం.
Also Read- Jayasudha: రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే పవర్‌ఫుల్ అండ్ డైనమిక్ సీఎం రేవంత్.. – జయసుధ
ఈ సభలో కూర్చోవడం నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఇది కేవలం అవార్డు గురించి మాత్రమే కాదు, ఈ ఐక్యత కోసం, నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా పునరుద్ధరించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీలాంటి యువ నాయకుడు మాత్రమే ఇటువంటి గొప్ప అవార్డు గురించి ఆలోచించగలరు. మిమ్మల్ని ఇంతసేపు నిలబెట్టినందుకు క్షమించాలి, కానీ మీకున్న పదవి అలాంటిది. నేను మళ్ళీ తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళాలి. అయినప్పటికీ, సమయం చూసుకుని ఇక్కడికి వస్తాను, ఎందుకంటే నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. అక్కడ (చెన్నై) నా బంధువులందరూ ఇల్లు మార్చుకుని హైదరాబాద్ వచ్చేశారు. మనమందరం ఒకే కుటుంబం. నన్ను ఇక్కడికి పిలిచినందుకు చాలా ధన్యవాదాలు’’ అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
Also Read- Rashmika Mandanna: కూతురిలా.. ఇకపై కోడలిగా! రష్మిక స్పీచ్‌కు రేవంత్ రియాక్షన్ ఇదే!