E-Paper
Advertisement

PCB Salaries: పాకిస్తాన్ క్రికెట‌ర్ల‌కు బిగ్ షాక్‌..3 నెల‌ల జీతాలు ఆపేసిన PCB

PCB Salaries:  పాకిస్తాన్ క్రికెట‌ర్ల‌కు బిగ్ షాక్‌..3 నెల‌ల జీతాలు ఆపేసిన PCB
Advertisement

PCB Salaries: పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఇప్పటికే T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్, ఆ వెంటనే బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయింది. 11 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పైన తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సెలక్షన్ కమిటీని అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీని మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దేశానికి సంబంధించిన దేశీయ క్రికెటర్లకు ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్ దేశీయ క్రికెటర్లకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆపేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read: Kavya Maran: దేశ ద్రోహి అంటూ కావ్య పాప‌ను ట్రోల్ చేస్తున్నారు, కానీ క‌రోనా, తుఫాన్లు వ‌చ్చిన‌ప్పుడు ఇండియాను ఆదుకున్న దేవ‌త !

పాకిస్తాన్ క్రికెట‌ర్ల‌కు బిగ్ షాక్‌..3 నెల‌ల జీతాలు ఆపేసిన PCB

Advertisement

పాకిస్తాన్ దేశీయ క్రికెటర్లకు మూడు నెలలుగా రావాల్సిన డబ్బులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఆపేసినట్లు వార్తలు వస్తున్నాయి. మూడు నెలల కిందట క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Quaid-e-Azam Trophy 2025) జరిగింది. అయితే ఈ టోర్నమెంట్లో ఆడిన దేశ క్రికెటర్లకు రెమ్యూనరేషన్ ఇంకా పూర్తిస్థాయిలో ఇవ్వలేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఈ దేశీయ క్రికెటర్లు ఆ డబ్బుల కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంట్లో సెంట్రల్ కాంట్రాక్ట్ దేశీయ క్రికెటర్లు ఆడితే, ఒక్కో మ్యాచ్ కోసం ఒక్కో ప్లేయర్ కు 6.28 లక్షలు ఇవ్వాలి.

అయితే ఇందులో కేవలం 30 వేల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మిగిలిన డబ్బులు అడిగితే, నాన్చుడు ధోరణితో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ఆ డబ్బులను ఎగగొట్టేందుకుగాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తోంది. అయితే తమకు న్యాయం జరగాలని, బకాయి డబ్బులు ఇవ్వాలని పాకిస్తాన్ దేశీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. బోర్డు నుంచి రావాల్సిన మొత్తాన్ని ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే మొహ్సిన్ నఖ్వీ లాంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు ఈ ప్లేయర్లకు ఇవ్వాల్సిన డబ్బులను నొక్కేసినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

పాకిస్తాన్ ప్లేయర్ ల నుంచి ఫైన్ వసూలు చేసేందుకు PCB కుట్రలు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో దారుణంగా విఫలమైన పాకిస్తాన్ జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో సూపర్ 8 దశ నుంచి ఎలిమినేట్ అయినందుకు గాను పాకిస్తాన్ ప్లేయర్లు బోర్డుకు ఫైన్ చెల్లించాలని ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఈ న్యూస్ కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Also Read: Inzamam-ul-Haq: అల్లా మీద ఒట్టు..ఇకపై టీమిండియాకు ఒక్క ట్రోఫీ రాదు, పాకిస్తానే వరుసగా 5 వరల్డ్ కప్ లు గెలుస్తుంది

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×