E-Paper
Advertisement

Kalki 2: సీనియర్స్ సిద్ధం..మరి ప్రభాస్ సంగతేంటి?

Kalki 2: సీనియర్స్ సిద్ధం..మరి ప్రభాస్ సంగతేంటి?
Advertisement

Kalki 2: ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas)హీరోగా , అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమలహాసన్ (Kamal Hassan) వంటి సీనియర్ స్టార్ సెలబ్రిటీలు నటించిన చిత్రం కల్కి 2898AD. సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త అంచనాలు క్రియేట్ చేసి కలియుగం అంతం అయ్యే సమయంలో ఇలా ఉంటుందా అనే ఊహాగానాలతో సాగిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా మొదటి భాగం ఏ రేంజ్ లో అయితే సక్సెస్ అయిందో.. క్రేజ్ రెండవ చిత్రంపై అంచనాలు పెంచిందనే చెప్పాలి. ముఖ్యంగా ముగింపు దగ్గర మైథాలజికల్ టచ్ ఇవ్వడంతో కర్ణుడు, అర్జునుడు ఎంట్రీ ఇచ్చారు. దీంతో కల్కి2 లో కథ ఎలా మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ అభిమానులలో విపరీతంగా పెరిగిపోయింది.

కల్కి 2 షూటింగ్ కి సిద్ధమైన సీనియర్స్..

ఇదిలా ఉండగా ఇప్పటికే కమలహాసన్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది
ఆయన పవర్ఫుల్ యాస్కిన్ పాత్రలో సుమారుగా 90 నిమిషాల పాటు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వనున్నారు అని , ఆయన మేకోవర్ కి సంబంధించిన ఫోటోలు కూడా సంచలనం సృష్టించాయి. అటు అమితాబ్ బచ్చన్ కూడా సీక్వెల్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి తోడు దీపికా పదుకొనే (Deepika Padukone) ను రెండవ భాగం నుంచి తప్పించారు. ఆమె స్థానంలో ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి నటించబోతోంది అనే వార్తలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలా సీనియర్స్ అందరూ సిద్ధమైపోయారు మరి ఈ సమయంలో ప్రభాస్ సంగతేంటి అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

మరి ప్రభాస్ సంగతేంటి?

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే ఈ ఏడాది మారుతీతో ‘ది రాజా సాబ్ ‘ సినిమా చేసి డిజాస్టర్ ను మూట కట్టుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ తో పాటు హను రాఘవపూడి ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఫౌజీ చిత్రం ఈ ఏడాది దసరాకు, స్పిరిట్ సినిమా వచ్చే యేడాది సమ్మర్ కు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రభాస్ తన సినిమాకు డేట్స్ ఇస్తాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ALSO READ:Sai Dhansika: షూటింగ్లో ఒక వ్యక్తిని చితక్కొట్టిన సాయి ధన్సిక.. హీరో దర్శకుడిని కూడా నెట్టేస్తూ!

విడుదల ఆలస్యం కానుందా?

Advertisement

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కల్కి 2కి ప్రస్తుతం ప్రభాస్ డేట్స్ ఇవ్వలేడు కాబట్టి ఆయన లేని కాంబినేషన్ సీన్లను ముందుగా ప్లాన్ చేస్తున్నారు. పైగా కమలహాసన్, అమితాబ్ బచ్చన్ కూడా ఈ నెలలోనే తమ డేట్స్ కేటాయించారు. దీంతో షూటింగ్ పనులు త్వరలోనే మొదలుకానున్నాయి. ఇక ప్రభాస్ షెడ్యూల్ , ఇతర ప్రాజెక్టుల విడుదల మధ్య గ్యాప్ ను కూడా దృష్టిలో పెట్టుకొని కల్కి 2ని వచ్చే యేడాది దసరా సమయంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సినీవర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి
. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రభాస్ ఈ రెండు సినిమాలపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కల్కి 2 కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.. మరి కల్కి 2 సినిమాతో ప్రభాస్ టీం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×