E-Paper
Advertisement

Kannada Actress Ramya: మగాళ్లను కుక్కలతో పోల్చిన నటి.. ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న నెటిజన్స్!

Kannada Actress Ramya: మగాళ్లను కుక్కలతో పోల్చిన నటి.. ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న నెటిజన్స్!
Advertisement

Kannada Actress Ramya: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మహిళలను ఉద్దేశించి శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శివాజీ వ్యాఖ్యలపై ఎంతోమంది స్పందిస్తూ తన తీరును తప్పుపట్టారు. మహిళల గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు అంటూ మండిపడ్డారు అయితే తాజాగా మరో నటి ఏకంగా మగాళ్ళను కుక్కలతో పోల్చి మాట్లాడటంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలు మగవారిని కుక్కలతో పోల్చిన నటి ఎవరు? ఏం జరిగింది? అనే విషయానికి వస్తే..

రాజకీయాలలో నటి రమ్య..

కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రమ్య అలియాస్ దివ్య స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా బిజీగా ఉన్న ఈమె సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల వైపు వెళ్లారు రాజకీయాల పరంగా కూడా సక్సెస్ అయ్యి ఎంపీగా గతంలో బాధ్యతలను నిర్వహించారు. ఇలా రాజకీయాలలోకి వెళ్లడం వల్ల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన రమ్య తరచూ సినిమాల గురించి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక రమ్య జంతు ప్రేమికురాలు అనే విషయం మనకు తెలిసిందే. ఈమె తరచూ జంతు సంరక్షణ గురించి సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ ఉంటారు.

మగవాళ్లను జైల్లో పెట్టాలి..

Advertisement

ఇదిలా ఉండగా ఇటీవల వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి కాస్త అసహనం వ్యక్తం చేశారు. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును వెల్లడిస్తూ.. వీధి కుక్క ఏది కరుస్తుందో, ఏది కరవదో ముందుగా తెలియదు అందుకే వీటిని తీసుకెళ్లి ఆశ్రయ కేంద్రాలలో ఉంచాలి అంటూ తీర్పును వెల్లడించింది . అయితే కోర్టు తీర్పును ఈమె తప్పు పడుతూ..”మగాళ్ళ మైండ్ కూడా చదవలేము వాళ్ళు ఎప్పుడు రే* చేస్తారో తెలియదు ఎప్పుడు మర్డర్ చేస్తారో తెలియదు కాబట్టి మగవాళ్ళు అందరిని కూడా జైలులో పెట్టాలా? అంటూ ఈమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.

దర్శన్ అభిమానుల నుంచి బెదిరింపు..

Advertisement

ఇలా మగవారిని కుక్కలతో పోల్చి ఈమె పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా ఈమె పోస్ట్ పై విభిన్న రీతిలో కామెంట్లు వ్యక్తం అవ్వడమే కాకుండా నటి తీరును తప్పు పడుతూ విమర్శలు కురిపిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా రమ్య తరచు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈమె నటుడు దర్శన్ విషయంలో చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈ వ్యాఖ్యలు అనంతరం దర్శన అభిమానులు తనని అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలా నిత్యం ఏదో ఒక వివాదం ద్వారా రమ్య వార్తల్లో నిలుస్తున్నారు.

Also Read: Sandeep Reddy Vanga : స్పిరిట్ పోస్టర్‌.. జిన్ బాటిల్‌లో విస్కీ.. లాజిక్ చెప్పిన సందీప్ రెడ్డి!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×