E-Paper
Advertisement

Sandeep Reddy Vanga : స్పిరిట్ పోస్టర్‌.. జిన్ బాటిల్‌లో విస్కీ.. లాజిక్ చెప్పిన సందీప్ రెడ్డి!

Sandeep Reddy Vanga : స్పిరిట్ పోస్టర్‌.. జిన్ బాటిల్‌లో విస్కీ.. లాజిక్ చెప్పిన సందీప్ రెడ్డి!
Advertisement

Sandeep Reddy Vanga: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సందీప్ రెడ్డి (Sandeep Reddy)ఒకరు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేస్తూ అక్కడ కూడా సక్సెస్ అందుకున్నారు. ఇక ఇటీవల సందీప్ రెడ్డి డైరెక్షన్లో యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సందీప్ రెడ్డితో రాజా సాబ్..

ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన రాజా సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. తాజాగా సందీప్ రెడ్డి(Sandeep Reddy)తో రాజా సాబ్ టీం ఒక ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో విడుదల చేశారు ఇందులో భాగంగా హీరోయిన్లు సందీప్ రెడ్డిని స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి సందేహాలను వ్యక్తపరుస్తూ ప్రశ్నలు వేశారు.

జిన్ బాటిల్ లో విస్కీ..

Advertisement

ఇటీవల జనవరి ఒకటవ తేదీన పురస్కరించుకొని స్పిరిట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ మొత్తం వైట్ కలర్ లోనే ఉంటుంది. ఇక ఈ పోస్టర్ లో ప్రభాస్ ఒంటిపై గాయాలతో, చేతిలో మందు బాటిల్ నోటిలో సిగరెట్ తో కనిపిస్తున్నారు. అయితే ప్రభాస్ చేతిలో ఉన్న బాటిల్ గురించి రాజా సాబ్ హీరోయిన్లు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రభాస్ చేతిలో ఉన్నది జిన్ బాటిల్. ఈ ఆల్కహాల్ చూడటానికి వైట్ కలర్ లో ఉంటుంది కానీ అందులోకి విస్కీ పోసి ఎందుకు పెట్టారు. ఇందులో ఏదైనా లాజిక్ ఉందా? అంటూ ప్రశ్న వేశారు.

ఆ టెన్షన్ కోసమే..

Advertisement

ఈ ప్రశ్నకు సందీప్ రెడ్డి సమాధానం చెబుతూ అందులో ఎలాంటి లాజిక్ లేదని తెలిపారు. పోస్టర్ మొత్తం వైట్ కలర్ లోనే ఉంది. ఇక జిన్ బాటిల్ లో విస్కీ కాకుండా అదే ఆల్కహాల్ ఉంటే ఆ బాటిల్ ఎక్స్పోజ్ అవ్వదు అందుకోసమే అందులోకి విస్కీ కలిపామని, కేవలం ప్రేక్షకుల అటెన్షన్ కోసమే జిన్ బాటిల్ లో విస్కీ కలిపాము ఇందులో ఎలాంటి లాజిక్ లేదు అంటూ ఈ సందర్భంగా సందీప్ రెడ్డి చెప్పిన ఈ సమాధానం వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్టర్ కు విపరీతమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో స్పిరిట్ సినిమాకి కూడా కాస్త బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. స్పిరిట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Also Read: Prabhas:స్పిరిట్ విషయంలో ప్రభాస్‌కు సందీప్ మరో కండీషన్… డార్లింగ్ కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైం

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×