E-Paper
Advertisement

Kannada Industry : కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..

Kannada Industry : కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..
Advertisement

Kannada Industry : కన్నడ ఇండస్ట్రీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత జో సైమన్ కన్నుమూశారు. 80 ఏళ్ల వయసు గల ఈ నటుడు గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో, అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నాడు. శుక్రవారం కన్నడ ఫిలిం లో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. అయితే అక్కడ గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. తీవ్రమైన గుండె నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఆయనను అక్కడున్న సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. నటుడుగా పలు సినిమాలలో నటించి అవార్డులను కూడా అందుకున్నారు. దర్శకుడుగా నటుడుగా రచయితగా నిర్మాతగా ఈయన కన్నడ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు మరణించారు అన్న వార్త విన్న సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆయన స్వగృహానికి వెళ్లి నివాళులర్పిస్తున్నారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కన్నడ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు రాజకీయ, ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం..

గుండెపోటుతో డైరెక్టర్ మరణం.. 

కన్నడ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా, రచయితగా, నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్నాడు జో సైమన్.. ఈయన నటించిన సినిమాలు అన్నీ కూడా జనాలని ఎంతో బాగా ఆకట్టుకున్నాయి.. ఎన్నో దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగిన ఈయన నిన్న జరిగిన ఫిలిం ఛాంబర్ సమావేశంలో గుండెపోటుకి గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ ఆసుపత్రికి తరలించిన మార్గమధ్యలో ఆయన మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు.. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలు కూడా ఆయనని ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం.. ప్రముఖ నటుడు చనిపోవడంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు.. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఆయన అంత్యక్రియలలో భాగం కానున్నారని సమాచారం..

జో సైమన్ నటించిన సినిమాలు…

Advertisement

ఈయన కర్ణాటకలోని మండ్యలో 1946లో జన్మించారు. ఇక 1967లో ఆయన కన్నడ ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేశారు. నటుడిగా, దర్శకుడిగా, గీత రచయితగా 100కు పైగా చిత్రాల్లో పనిచేశారు.. ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటులు విష్ణువర్ధన్, అంబ్రిష్ లతో మంచి సాహిత్యం ఏర్పడింది.. ఇకపోతే సాహస సింహా, సింహా జోడి వంటి పాపులర్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. రవివర్మ, మణి, టైమ్ బాంబ్ తదితర సినిమాల్లో నటించారు. తన నటనతో జనాలను మెప్పించిన సైమన్ ప్రస్తుతం గుండెపోటుతో మరణించడంతో ఎంతోమంది అభిమానులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం వార్త విన్న కర్ణాటక డిప్యూటీ సీఎం సంతాపం తెలిపారు.. లెజెండరీ నటుడిని కోల్పోవడంతో కన్నడ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.. పలువురు సినీ తారలు ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు..

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×