Telangana Municipal Elections: పల్లెలతో పాటు పట్టణాల్లోనూ ఓటర్లు కాంగ్రెస్ కే పట్టం కట్టారు.వరుసగా వచ్చిన అన్ని ఎన్నికల్లోనూ హస్తం హవా పెరుగుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి మధ్యలో వచ్చిన ఉప ఎన్నికలు, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు తాజాగా పురపాలక, నగర పాలక ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని ఓటర్లు కాంగ్రెస్ కు బ్రహ్మ రధం పట్టారు.రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు,7 కార్పొరేషన్లలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 88 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ప్రతిపక్ష పార్టీలు కనుచూపు మేరలో కూడా కనిపించని విధంగా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఓటర్లు ప్రజా ప్రభుత్వం పాలనకు మొగ్గు చూపారు. అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీకే జై కొట్టారు.ఇక 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే 4 చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులే ఎక్కువ డివిజన్లను సాధించారు. కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా మొత్తం 60 వార్డులలో కాంగ్రెస్ 22 సీట్లు గెలుచుకుంది. మిత్రపక్షంగా ఉన్న సీపీఐ కూడా 22 సీట్లు గెలుచుకుంది. మిగతా పార్టీలు, ఇండిపెండెంట్లు కలిసి మిగతా స్థానాలు గెలుచుకున్నారు.నిజామాబాద్,కరీంనగర్ కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ కు అధిక్యత స్వల్పంగా తగ్గినప్పటికీ అనిచ్చిత ఫలితాలు రావడం హంగ్ కు దారి తీసినట్లయింది.అయితే ఎన్నికలు జరిగిన అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు. ఓటర్లందరూ ప్రజా ప్రభుత్వంపై తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శించారు.
ఇటీవల డిసెంబర్లో స్థానిక సంస్థల(పంచాయతీలు) ఎన్నికలు జరిగాయి.ఆ ఎన్నికలలోనూ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించింది.రాష్ట్రంలో 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, రెబెల్స్ కలిసి 8335 గ్రామ పంచాయతీలు గెలుచుకున్నారు. అంటే రాష్ట్రంలో పల్లెలైనా, పట్టణాలైనా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే జై కొట్టారు. తమ అద్భుతమైన తీర్పుతో ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు, రోజూ మాట్లాడే అబద్ధాలకు చెంప పెట్టులాంటి తీర్పునిచ్చారు. మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం 116 మున్సిపాలిటీల్లో 83 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 16 సీట్లలో బీఆర్ఎస్, 2 చోట్ల బీజేపీ (ఆదిలాబాద్, నారాయణపేట), 2 చోట్ల ఇతర పార్టీలు (భైంసా ఎంఐఎం, వడ్డేపల్లి (ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్) ఆధిక్యతలో ఉన్నాయి.ఇక గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలాంటి ఈ ఎన్నికలు జరగలేదు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన దాదాపు 81 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏకంగా 68 నియోజకవర్గాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. వాళ్లందరికీ కాంగ్రెస్ పార్టీ ఎంతో రుణపడి ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
Also Read: Road Accident: నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ముగ్గురు..!
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పంచాయితీ ల్లో 66 శాతం ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించింది. అప్పటితో పోలిస్తే ఈ మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరిగింది. మున్సిపాలిటీల ఫలితాలను చూస్తే ఏకంగా 75.8% ఫలితాలను ప్రజా ప్రభుత్వం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూ వస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఉప ఎన్నికలలో అదే తీరుగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. 2023 లో దాదాపు 40 శాతానికి పైగా ఓట్లు సాధించిన కాంగ్రెస్, జూబ్లీహిల్స్ లో ఏకంగా సుమారు 52 శాతం ఓట్లను సాధించింది. సర్పంచ్ ఎన్నికలు 94 శాసనసభ నియోజక వర్గాల పరిధిలో జరిగితే, కాంగ్రెస్ పార్టీ 87 నియోజకవర్గాల స్థానాల్లో ఆధిక్యత చూగా, మున్సిపల్ ఎన్నికలు 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లోజరిగాయి. వీటిలో 68 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలన్నీ కలిసి 13 నియోజకవర్గాల్లో కొంత ప్రభావం చూపించాయి.ఇక ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయాయి. ప్రజా ప్రభుత్వం ఏ పని చేసినా… అవినీతి ఆరోపణలు అంటూ వ్యాఖ్యానించినా… పట్టణ ప్రాంత ప్రజలు వారిని ఏమాత్రం విశ్వసించలేదు.
మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలంతా ప్రజా ప్రభుత్వం వైపే నిలిచి కాంగ్రెస్ సర్కారు విశ్వసనీయతను మరోసారి నొక్కి చెప్పారు. ఆఖరికి ఇటీవల జరిగిన సమ్మక్క, సారక్క జాతరను రూ. 250 కోట్లతో ప్రగతి పనులు చేపడితే కూడా అందులోనూ అవినీతి అంటూ ప్రతిపక్ష పార్టీలు అనవసర ప్రచారం చేసినా, వారి మాటలను ప్రజలు ఏమాత్రం నమ్మకపోవడం గమనార్హం.ఇక బీఆర్ఎస్ నేతలు ఈ మున్సిపల్ ఎన్నికలు రెఫరెండం అంటూ వ్యాఖ్యానించారు. అయితే, మున్సిపల్ ప్రజలు, పంచాయతీ గ్రామాల ప్రజలు, పార్లమెంట్, బై ఎలక్షన్స్ ఇలా ఏ ఎన్నిక జరిగినా, రేవంత్ సర్కార్ కు ప్రజలు అండగా నిలవడం గమనార్హం. తెలంగాణ రైజింగ్ కింద ప్రజా ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధికి, రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు దాదాపు 17 వేల కోట్లు ఖర్చు చేస్తూ, ప్రగతి చేపడుతున్న నేపథ్యంలో అర్బన్ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ వైపు పెద్ద ఎత్తున నిలిచారు.ఈ రెండెండ్లలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివ్రుద్ధి పనులకు గ్రామీణ ప్రాంత ప్రజలు, పట్ణణ ప్రజానీకం హస్తం పార్టీకి అండగా నిలిచారు.
తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా ప్రతి పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ ప్రకటించడం, తానే మున్సిపల్ మంత్రిగా,ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్లాన్ లను అమలు చేశారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయడం, 30 లక్షల మంది పేదలకి రేషన్ కార్డులు, నిరుపేదలందరికీ సన్న బియ్యం, పట్టణాల్లో ప్రగతి పనులకు రూ. 17 వేల కోట్లు ఖర్చు చేయడం, ప్రభుత్వ సంక్షేమ సంస్థల్లో చదువుతున్న 7.5 లక్షల మంది విద్యార్థులకు 40 శాతం కాస్మొటిక్ ఛార్జీల పెంపు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, ఆర్టీసీలో ప్రతి మహిళకు ఉచిత రవాణా,పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, పేదవాడికి సొంతింటి కల నేరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద వైద్యానికి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల పెంపు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి ప్రగతి పనులను పరిశీలించిన మున్సిపల్ ప్రాంతాల్లోని ప్రజలు సంపూర్ణంగా ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. అయితే ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయడం..ప్రతి పట్టణాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని చేయడం కాంగ్రెస్ ఓటు బ్యాంకు ను మరింత పెంచింది. ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు ఆయన ఎన్నికల ప్రచారంలోనే బీజీగా గడిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు వంటివి సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పాజిటివ్ వేవ్ ను క్రియేట్ చేయగలిగారు.