Toxic Release Postponed: కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్.. ప్రముఖ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఇది కూడా ఒకటి. కెజీఎఫ్ 2 తర్వాత చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నాయి. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు కొన్ని కారణాలు వల్ల వాయిదా పడిందని తెలుస్తుంది. మరి టాక్సిక్ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
కన్నడ స్టార్ హీరో యష్, గీతూ మోహన్ దాస్ కాంబోలో వస్తున్న టాక్సిక్ మూవీ టీజర్ లో కొన్ని శృతి మించిన రొమాంటిక్ సీన్స్ఉ న్నాయని అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిత్ర దర్శకులు గీతూ క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఇది ఒకటి. ఈ నెల 19 న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ లేదా మే ఈ మూవీని రిలీజ్ చెయ్యనున్నట్లు తెలుస్తుంది.. అతి త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..
Also Read : అమ్మనాన్నల పేరు మీద విజయ్ దేవరకొండ ఎన్ని కోట్ల ఆస్తి రాశాడో తెలుసా.?
మార్చి 19న రణవీర్ సింగ్ నటించిన దురంధర్ 2 మూవీ రిలీజ్ కాబోతుంది.. టాక్సిక్ కూడా ఏ మాత్రం తీసిపోకుండా ప్రమోషన్స్ మొదలుపెట్టాలి కానీ పెద్దగా యష్ టీమ్. ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. దాంతో సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి.. ఇప్పుడు అనుకున్నట్లుగానే సినిమా వాయిదా పడిపోయింది. మరోవైపు అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. దాంతో ఓవర్సీస్ లో సినిమాను జనాలు చూడలేని పరిస్థితి.. అందుకే ఈ మూవీ కలెక్షన్స్ పై ఎక్కడా గండి పడకుండా జాగ్రత్తలు తీసుకొని కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.. ఈ చిత్రాన్ని ఎట్టకేలకు జూన్ 4న థియేటర్లలోకి తీసుకురావడానికి ముహూర్తం పెంచేశారు.. అప్పటి వరకు యుద్ధ వాతావరణం సద్దుమణిగుతుందేమో చూడాలి.. అప్పటికి అక్కడ వారు గనక ఆగకుండా ఉంటే ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా కూడా ఇక ఈ నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాలు అన్నీ కూడా ఒక్కొక్కటి వాయిదా పడే అవకాశం కూడా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక నెక్స్ట్ ఏ సినిమా పోస్ట్ పోన్ అవుతుందో అన్నది ఆసక్తిగా మారింది..
Toxic : A Fairy Tale for Grown-Ups – in Cinemas Worldwide on 4 June 2026 pic.twitter.com/tg28qLUooH
— KVN Productions (@KvnProductions) March 4, 2026