E-Paper
Advertisement

Worst Travel Crises: కోవిడ్-19 To ఇరాన్ వార్.. 2020 నుంచి ప్రపంచ ఎదుర్కొన్న అతిపెద్ద విమాన ప్రయాణ సంక్షోభాలు ఇవే!

Worst Travel Crises: కోవిడ్-19 To ఇరాన్ వార్.. 2020 నుంచి ప్రపంచ ఎదుర్కొన్న అతిపెద్ద విమాన ప్రయాణ సంక్షోభాలు ఇవే!
Advertisement

ఇరాన్- ఇజ్రాయెల్ యద్ధం నేపథ్యంలో తీవ్రమైన విమాన ప్రయాణ సంక్షోభం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా మిడిల్ ఈస్ట్ కు వెళ్లే సుమారు 12 వేల విమానాలు రద్దు అయ్యాయి. ఇండియా నుంచి రాకపోకలు సాగించే పలు విమానాల మీద కూడా తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో 2020 నుంచి ఎదురైన అత్యంత పెద్ద ప్రయాణ అంతరాయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ కోవిడ్-19 సమయంలో ప్రపంచ షట్‌డౌన్

ఆధునిక విమానయాన చరిత్రలో కోవిడ్-19 సంక్షోభం అత్యంత పెద్దది. COVID-19 కారణంగా అన్ని దేశాలు సరిహద్దులను మూసివేసాయి. వీసాలను నిలిపివేసాయి. లాక్‌డౌన్‌లు విధించాయి.. గతంలో ముందు ఎన్నడూ చూడని స్థాయిలో విమానాలను నిలిపివేశాయి. సంక్షోభం తారాస్థాయికి చేరుకున్న సమయంలో అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ 60 శాతానికి పైగా పడిపోయింది. మొత్తం విమానాశ్రయ టెర్మినల్స్ మూసివేయబడ్డాయి. విమాన పరిశ్రమ కోట్ల రూపాయలను కోల్పోయింది. ప్రధాన విమానయాన సంస్థలు మనుగడ సాగించడానికి ప్రభుత్వ బెయిలౌట్‌లను కోరాయి. కోవిడ్-19 తర్వాత విమాన సంస్థలు బయటపడేందుకు చాలా సమయం పట్టింది.

⦿ అమెరికా శీతాకాల తుఫాను, సౌత్‌వెస్ట్ ఎయిర్‌ లైన్స్ మాంద్యం

Advertisement

2022 క్రిస్మస్ ప్రయాణ రద్దీ సమయంలో అమెరికా అంతటా తీవ్రమైన శీతాకాలపు తుఫాను అల్లకల్లోలం సృష్టించింది. అనేక విమానయాన సంస్థలు ప్రభావితమయ్యాయి. సౌత్‌ వెస్ట్ ఎయిర్‌ లైన్స్‌ లో సంక్షోభంలో కూరుకుపోయింది. చాలా రోజుల పాటు 16,000 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి. సెలవుల సీజన్‌ లో వేలాది మంది ప్రయాణికులు ఎక్కడిక్కడే చిక్కుకుపోయారు. విమానాశ్రయాలు క్లెయిమ్ చేయని లగేజీతో నిండిపోయాయి. US విమానయాన చరిత్రలో అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొందు.

⦿ UK ఎయిర్‌ స్పేస్ సంక్షోభం

ఆగస్టు 2023లో UK ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రొవైడర్, నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ లో సాంకేతిక లోపం దేశ వ్యాప్తంగా అంతరాయం కలిగించింది.  హీత్రో, గాట్విక్ లాంటి ప్రధాన విమానాశ్రయాలు వందలాది రద్దులు, దీర్ఘ జాప్యాలను ఎదుర్కొన్నాయి. ఈ అంతరాయం యూరోపియన్ నెట్‌ వర్క్‌ లోకి కూడా వ్యాపించింది. పరిస్థితి చక్కబడేందుకు చాలా రోజుల సమయం పట్టింది.

⦿ ఇండిగో షెడ్యూలింగ్ సంక్షోభం

Advertisement

భారత్ లో అతిపెద్ద విమానయాన సంస్థ, భారత విమానయాన నియంత్రణ సంస్థ ప్రవేశపెట్టిన ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ కారణంగా షెడ్యూలింగ్ లో సంక్షోభం తలెత్తింది. తీవ్రమైన సిబ్బంది కొరతతో, దేశీయ మార్గాలలో పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

⦿ మిడిల్ ఈస్ట్ లో యుద్ధం

ఇజ్రాయెల్- ఇరాన్‌ ఉద్రిక్తతలు అంతర్జాతీయ విమానయానానికి రెండు సార్లు సంక్షోభానికి కారణం అయ్యాయి. 2023తో పాటు ప్రస్తుతం వేలాది విమానాలు రద్దు అయ్యాయి. వేలాది మంది ప్రయాణీకులు గల్ఫ్ కంట్రీస్ లో చిక్కుకుపోయారు. ప్రపంచ ఎయిర్ ట్రావెల్ తీవ్ర అస్థిరత నెలకొంది. ఇప్పుడిప్పుడే మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్నాయి.

Read Also: ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం.. చుక్కలు చూపిస్తున్న విమాన టికెట్ ధరలు!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×