BigTV English

Kantara1: బాహుబలిని ఢీ కొడుతున్న కాంతార చాప్టర్ 1… లెక్కలు మారేలా ఉన్నాయే ?

Kantara1: బాహుబలిని ఢీ కొడుతున్న కాంతార చాప్టర్ 1… లెక్కలు మారేలా ఉన్నాయే ?
Advertisement

Kantara1: కాంతార చాప్టర్ 1 పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతున్న పేరు. కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishabh Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా మొదటి షో నుంచి ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టింది. ఈ సినిమా 20 రోజులకు గాను ఏకంగా 720 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టిస్తోంది. ఇలా ఏకకాలంలో ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని మరో భాషలో విడుదల చేయటానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఇంగ్లీష్(English) భాషలో కూడా విడుదల కాబోతోందని తెలుస్తోంది.


బాహుబలికి పోటీగా కాంతార1..

దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ విడుదల అయ్యింది. అయితే అక్టోబర్ 31 వ తేదీ ఈ సినిమా ఇంగ్లీష్ భాషలో కూడా విడుదల కాబోతుందని చిత్ర బృందం ప్రకటించారు. ఇలా ఈ సినిమా ఇంగ్లీష్ భాషలో అక్టోబర్ 31వ తేదీ విడుదల కాబోతుందని తెలియడంతో అభిమానులు కూడా ఒక్కింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 31వ తేదీ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) నటించిన బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా తిరిగి విడుదల అవుతున్న భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్, ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోవడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

బాహుబలి ది ఎపిక్..

ఈ క్రమంలోనే బాహుబలిని ఢీకొట్టడానికి కాంతార1 సిద్ధం అయిందనే విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక అక్టోబర్ 31వ తేదీ టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర సినిమాని కూడా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి అక్టోబర్ 31వ తేదీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ ఉందని తెలుస్తోంది. బాహుబలి సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు భాగాలు తిరిగి బాహుబలి ది ఎపిక్ పేరిట విడుదలకు సిద్ధమవుతోంది.


ఇంగ్లీష్ వర్షన్ లో కాంతార1..

ఇప్పటికే రీ రిలీజ్ సినిమాలు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుండగా రాజమౌళి మాత్రం ఇలా రెండు భాగాలను ఒకేసారి కొత్త సినిమాగా విడుదల చేస్తూ మరొక ట్రెండ్ సెట్ చేశారని చెప్పాలి. ఇక ఈ సినిమా విభిన్నంగా, ఉండబోతుందని ప్రేక్షకులకు మరొక కొత్త అనుభూతిని ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఇక బాహుబలి రెండు భాగాలలో కొన్ని సన్నివేశాలను తొలగిస్తూ అదనపు సన్నివేశాలను కూడా ఇందులో జోడించారని చిత్ర బృందం వెల్లడించారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ బాహుబలి ది ఎపిక్ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి పోటీగా కాంతార1 ఇంగ్లీష్ వర్షన్ కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. మరి ఈ పోటీలో ఏ సినిమా లెక్కలు మారుతాయో తెలియాల్సి ఉంది.

Related News

Ramya Krishnan: ఐటమ్ సాంగ్స్ మళ్లీ చేయాలని ఉంది.. ఈ వయసులో ఆ కోరికలేంటీ బాబోయ్!

Akira: ఏంటి పాప.. పవన్‌కు కోడలు అవ్వాలని చూస్తున్నావా.. అకీరాతోనే సరసాలు ఆడుతున్నావ్

Thamma Collections: గోల్డెన్ లెగ్ గా రష్మిక.. థామా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Gun Fire on Singer : ప్రముఖ సింగర్ పై కాల్పులు.. చంపేస్తామని బెదిరింపులు

Pooja Hegde: బన్నీ కోసం స్పెషల్ స్టెప్పులు వేయనున్న బుట్టబొమ్మ.. కళ్ళు చెదిరే రెమ్యునరేషన్!

Ilayaraja: ప్రదీప్ రంగనాథన్ పై కేసు వేసిన ఇళయరాజా..డ్యూడ్ మూవీకి చిక్కులు

Prabhas Spirit :స్పిరిట్‌ మళ్లీ వాయిదా… తప్పు డార్లింగ్‌దా? సందీప్‌దా?

Big Stories

×