UP Crime News: కొన్ని ఘటనలు షాక్ ఇచ్చేలా ఉంటాయి. ఎప్పుడు ఏం జరిగిందో తెలీదు. కాకపోతే అనుమానం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. ఫలితంగా అనేక అనర్థాలకు దారి తీస్తుంది. కాబోయే భార్యతో హోటల్‌లో ఉంటున్నాడు ఓ డాక్టర్. అనుకోకుండా ఆరోగ్యం క్షీణించి మృత్యువాతపడ్డాడు. ఈ విషయం తెలిసి డాక్టర్ పేరెంట్స్ షాకయ్యారు. అసలేం జరిగింది? కాబోయే భార్య ప్రమేయం ఏమైనా ఉందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు వెంటాడుతున్నాయి.
హోటల్‌లో ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. చైనా నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశారు 28 ఏళ్ల డాక్టర్ ఫుజైల్ అహ్మద్. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నాడు. అదే సమయంలో కాబోయే భార్యతో కలిసి భరత్‌నగర్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో ఉంటున్నాడు.
రెండురోజుల కిందట ఏం జరిగిందో తెలీదుగానీ అర్థరాత్రి అతడి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. వెంటనే అహ్మద్ కాబోయే భార్య హోటల్ సిబ్బందికి చెప్పింది. సదరు డాక్టర్‌ని స్థానిక ట్రామా సెంటర్‌కు తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా, అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. కాబోయే భర్త మరణించడంతో షాకైంది ఆ యువతి. ఈ ఘటనపై పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డాక్టర్ అహ్మద్ మృత్యువాత
పోస్ట్‌మార్టం నివేదిక ఇంకా రావాల్సివుంది. డాక్టర్ అహ్మద్ మృతి చెందిన విషయం అతడి మామ హిలాల్ అక్తర్ తెలిసి షాకయ్యాడు. తమకు పోలీసుల నుండి ఫోన్ వచ్చిందని చెప్పాడు. తన మేనల్లుడు ఫుజైల్ ఓ అమ్మాయితో కలిసి హోటల్‌లో బస చేస్తున్నాడని చెప్పాడు. డాక్టర్ ఫుజైల్ ఆకస్మిక మరణాన్ని తాము అంగీకరించలేమని చెప్పారు. దీనిపై ఆ కుటుంబం సమగ్ర దర్యాప్తు కోరింది.
డాక్టర్ ఫుజైల్‌తో కలిసి హోటల్‌లో బస చేసిన అమ్మాయి, సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. హోటల్‌లో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు. జరిగిన ఘటన చుట్టూ ఉన్న పరిస్థితులను స్పష్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు మరణం ఎలా జరిగింది అనేది తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు.
ALSO READ: తోటలో తాత తీట పనులు.. మైనర్ బాలికపై అఘాయిత్యం, నిందితుడు టీడీపీ నేత
ఈ క్రమంలో డాక్టర్ ఫుజైల్ అహ్మద్ ఫ్రెండ్స్, క్లాస్‌మేట్‌లను సంప్రదిస్తున్నారు పోలీసులు. అహ్మద్‌కు ఏదైనా ఒత్తిడి లేదా బాధ ఎదుర్కొంటున్నాడా? అనేదానిపై తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. డాక్టర్ ఫోన్ కాల్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలపై దర్యాప్తు చేయాలని డాక్టర్ కుటుంబసభ్యులు పోలీసులను కోరారు. అనుకోకుండా డాక్టర్ మృతి చెందాడా? లేకుంటే అమ్మాయి కారణమైందా? అనే విషయాలు తెలియాల్సివుంది.