Harshit Rana: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి అనేక అరాచకాలు తెరపైకి వస్తున్నాయి. తనకు నచ్చిన వాళ్లకే కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ పదవులు గౌతమ్ గంభీర్ ఇస్తున్నారని, సరిగ్గా ప్రదర్శన చేయని వాళ్లకు టీమిండియాలో ఛాన్స్ కల్పిస్తున్నారని అనేక విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత నెగిటివిటీ వచ్చినా కూడా గౌతమ్ గంభీర్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కార్ ఇద్దరు కలిసి అభిమానులపై పిడుగు వేసే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: Team India -Divorce: విడాకులు తీసుకున్న మరో టీమిండియా ప్లేయర్…భార్య లేకుండానే దీపావళి వేడుకలు
త్వరలోనే టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ గా హర్షిత్ రాణాను చేసే ఆలోచనలో గౌతమ్ గంభీర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నవంబర్ మాసంలో టెస్ట్ సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ గా హర్షిత్ రాణాకు అవకాశం కల్పిస్తారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ దిశగా గౌతమ్ గంభీర్ తో పాటు అజిత్ అగార్కర్ ప్రయత్నాలు చేస్తున్నారట.
దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నవంబర్ 14వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ రెండు జట్ల మధ్య కేవలం రెండు టెస్టులు మాత్రమే ఇండియాలో జరగనున్నాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14వ తేదీ నుంచి కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. రెండు టెస్టు గౌహతి వేదికగా నవంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అయితే స్వదేశంలో ఈ టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో కెప్టెన్ గా శుభమన్ గిల్ కొనసాగుతారు. రిషబ్ పంత్ కు రెస్ట్ ఇవ్వనున్నారట. దీంతో హర్షిత్ రాణాకు వైస్ కెప్టెన్సీ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అజిత్ అగార్కర్ తో పాటు గౌతమ్ గంభీర్ నిర్ణయం కూడా తీసుకొని, బీసీసీఐ చీఫ్ కు సమాచారం అందించారట. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో మళ్లీ పెద్ద దుమారం మొదలైంది. ఏమిరాని వాడికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం ఏంటని జనాలు ఫైర్ అవుతున్నారు. మరికొన్ని రోజులు అయితే, బీసీసీఐ అధ్యక్షుడు కూడా హర్షిత్ రాణా అవుతాడని సెటైర్లు పేల్చుతున్నారు.
దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20లు జరగనున్నాయి. ఇందులో టెస్ట్ సిరీస్ నవంబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ ఆరో తేదీ వరకు వన్డేలు జరుగుతాయి. ఇక డిసెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు టి20 లు ఐదు పూర్తి అవుతాయి.
🚨 ANNOUNCEMENT 🚨
🚨VICE CAPTAIN HARSHIT RANA🚨
Harshit Rana may be vice-captain of the Indian team in the upcoming Test series against South Africa. pic.twitter.com/w4UxRDotwR
— indianTeamCric (@Teamindiacrick) October 21, 2025