E-Paper
Advertisement

డెసీ బ్లింగ్ షోలో తేజస్వి ప్రకాష్‌కు మోకాళ్లపై ప్రపోజ్ చేసిన కరణ్ కుంద్రా.. నటి ఎమోషనల్..

డెసీ బ్లింగ్ షోలో తేజస్వి ప్రకాష్‌కు మోకాళ్లపై ప్రపోజ్ చేసిన కరణ్ కుంద్రా.. నటి ఎమోషనల్..
Advertisement

TejRan Proposal: బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన సెలబ్రిటీ జంట తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రా పెళ్లి పీటలు ఎక్కాలని వారి అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీరి రహస్య వివాహం గురించి పలు పుకార్లు వచ్చినప్పటికీ, ఇప్పుడు అభిమానుల కల నిజమయ్యే సమయం వచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల కరణ్, తేజస్వికి పెళ్లి ప్రపోజల్ పెట్టారు. ‘దుబాయ్ బ్లింగ్’ సిరీస్ ఇండియన్ స్పిన్-ఆఫ్ గా మే 20న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన కొత్త రియాలిటీ షో ‘డెసీ బ్లింగ్’ లో కరణ్ కుంద్రా, తేజస్వికి ఎంతో రొమాంటిక్‌గా ప్రపోజ్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Read also-Mega158 అప్డేట్.. మూవీ ప్రారంభోత్సవానికి హాజరైన డీసీఎం పవన్ కళ్యాణ్..

Advertisement

తాజా ఎపిసోడ్‌లలో ఒకదానిలో, కరణ్ కుంద్రా ఈ షోలోని ఇతర తారాగణం (రిజ్వాన్ సాజన్, సతీష్ సన్‌పాల్, అడెల్ సాజన్, సనా సాజన్, తబిందా సన్‌పాల్, పమేలా సెరెనా, ద్యుతి పారుక్, ఇరినా కినాఖ్, అలీజే మీర్జా, లైలీ మీర్జా, జాన్వీ గౌర్) లతో కలిసి తేజస్వి కోసం ఒక గ్రాండ్ అండ్ లగ్జరియస్ ప్రపోజల్ ప్లాన్ చేశారు. తేజస్వి ఆ ప్రదేశానికి చేరుకోగానే, అక్కడ నీటిపై పెద్ద పెద్ద అక్షరాలతో వెలుగుతున్న “విల్ యూ మ్యారీ మీ?” బోర్డును చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ వెంటనే కరణ్ కుంద్రా మోకాళ్లపై కూర్చుని, పంజాబీ స్టైల్‌లో “తేజస్వి ప్రకాష్, విల్ యూ మ్యారీ మీ?” అని అడుగుతూ రింగ్‌తో ప్రపోజ్ చేశారు.

ఈ సర్‌ప్రైజ్‌కు తేజస్వి ఎంతో భావోద్వేగానికి గురైంది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె ఇలా స్పందించింది. “నేను వణికిపోతున్నాను. నా చేతులు అస్సలు ఆగడం లేదు.” గతంలో తమ రిలేషన్‌షిప్‌పై జనాలు చేసిన విమర్శలను గుర్తుచేసుకుంటూ… “మనం మొదట కలుసుకున్నప్పుడు ఎన్నో విషయాలు జరిగాయి. మనం బయటకు వచ్చాక, ‘వీరి బంధం రెండు వారాలు కూడా నిలవదు’ అని అందరూ అన్నారు. నన్ను కొందరు ఫేక్ అన్నారు, నిన్ను మరికొందరు ఫేక్ అన్నారు. కానీ ఇప్పటికి నాలుగేళ్లు దాటింది. మనం అన్నింటినీ చూశాం, కలిసి అన్ని కష్టాలనూ దాటుకుంటూ వచ్చాం” అని ఎమోషనల్ అయింది.

Advertisement

ఆ తర్వాత కరణ్ స్పందిస్తూ… “‘ఇంపర్ఫెక్ట్‌లీ పర్ఫెక్ట్ లవ్ స్టోరీ’ అని ఈ పేరు పెట్టింది నువ్వే. నీతో గడిపిన ప్రతి సంవత్సరం నాకు ప్రేమ యొక్క అర్థాన్ని మార్చేసింది. నేను ఎప్పుడైనా ప్రేమలో పడతానని లేదా ఒకరికి కట్టుబడి ఉంటానని అస్సలు అనుకోలేదు. నాలోని నిజమైన మగాడిని బయటకు తెచ్చినందుకు నీకు ధన్యవాదాలు. ‘ఇదే నా జీవితం, ఇది ఇప్పటికీ.. ఎప్పటికీ’ అని ధైర్యంగా చెప్పేలా నన్ను మార్చావు” అని ఎంతో రొమాంటిక్‌గా తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఈ మాటలకు తేజస్వి కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసింది.

Read also-యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘డ్రాగన్’.. 24 గంటల్లోనే ఆల్‌టైమ్ రికార్డ్!

కథ ఎక్కడ మొదలైందంటే..

కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్‌లు ‘బిగ్ బాస్ 15’ షోలో తొలిసారి కలుసుకున్నారు. ఆ షోలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ సీజన్‌లో తేజస్వి విజేతగా నిలవగా, కరణ్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. షో అయిపోయాక విడిపోయే మిగతా జంటల్లా కాకుండా, వీరు తమ బంధాన్ని ఎంతో బలంగా కొనసాగిస్తూ వచ్చారు. వీరిద్దరినీ అభిమానులు ముద్దుగా “తేజ్‌రన్” అని పిలుచుకుంటారు. ప్రస్తుతం ఈ జంట ‘లాఫ్టర్ షెఫ్స్’ కుకింగ్ రియాలిటీ షోలో కూడా కలిసి సందడి చేస్తోంది. ఇప్పుడు ఈ అఫీషియల్ ప్రపోజల్ వీడియో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×