E-Paper
Advertisement

Yo-Yo టెస్ట్ లో కోహ్లీని మించినోడు, కేకేఆర్ కు ప్రాణం పోసిన‌ హీరో మ‌నీష్ పాండే..మ‌రి టీమిండియాలో ఎందుకు స‌క్సెస్ కాలేదు ?

Yo-Yo టెస్ట్ లో కోహ్లీని మించినోడు, కేకేఆర్ కు ప్రాణం పోసిన‌ హీరో  మ‌నీష్ పాండే..మ‌రి టీమిండియాలో ఎందుకు స‌క్సెస్ కాలేదు ?
Advertisement

Manish Pandey:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన కేకేఆర్ బంపర్ విక్టరీ నమోదు చేసుకుంది. ముంబై ఇండియన్స్ పై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితులలో, నాలుగు వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది కేకేఆర్. దీంతో ప్లే ఆఫ్స్ చాన్సులను మరింత పెంచుకుంది. దీనంతటికీ ముఖ్య కారణం కేకేఆర్ ఆటగాడు మనీష్ పాండే. రఘువంషి స్థానంలో నిన్న బ్యాటింగ్ చేసిన మనీష్ పాండే, ఏకంగా 45 పరుగులు సాధించి కేకేఆర్ ను విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో మనీష్ పాండే ( Manish Pandey) గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

Also Read: Ramiz Raza : ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది…నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు

Yo-Yo టెస్ట్ లో కోహ్లీని మించినోడు, కేకేఆర్ కు ప్రాణం పోసిన‌ హీరో

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం అయినప్పటి నుంచి మనీష్ పాండే ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ ఒకే ఒక్క జట్టుకు 19 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తే.. రోహిత్ శర్మ రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక మనీష్ పాండే ఏకంగా ఏడు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఒకే ఒక్కసారి 11 కోట్లు పలికాడు. 2018 సమయంలో హైదరాబాద్ జట్టు 11 కోట్లు పెట్టి మనీష్ పాండేను కొనుగోలు చేసింది. ఇలా మొత్తం 19 సీజన్లలో ఏదో ఒక జట్టు తరఫున బరిలోకి దిగాడు మనీష్ పాండే. ఒకసారి కేకేఆర్ ఛాంపియన్ కావడం లో కూడా తన వంతు పాత్ర పోషించాడు. 36 సంవత్సరాలు ఉన్న మనీష్ పాండే… అద్భుతమైన ఫిట్నెస్ తో ముందుకు సాగుతున్నాడు. 2017 సమయంలో యోయో టెస్టులో 19.2 స్కోర్ సాధించి రికార్డు సృష్టించాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ యోయో టెస్ట్ స్కోర్ కేవలం 19 మాత్రమే. అంతలా అద్భుతమైన ఫిట్నెస్ సాధించినప్పటికీ టీమిండియాలో మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు మనీష్ పాండే.

టీమిండియాలో ఎందుకు స‌క్సెస్ కాలేదు ?

దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. టీమిండియా తరఫున వన్డేలు, టి20 లు, మొత్తం కలిపి 60 కి పైగా మ్యాచ్ లలో ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియాపై సిడ్నీలో సెంచరీ మినహా మిగిలిన మ్యాచ్ లలో పెద్దగా రాణించలేదు. దానికి తోడు సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కె ఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా లాంటి డేంజర్ ఆటగాళ్ల వల్ల అతనికి గట్టి పోటీ ఎదురైంది. వాళ్లతో పోటీ పడలేక టీమ్ ఇండియాలో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు మనీష్ పాండే. కానీ ఐపీఎల్ లో మాత్రం మంచి ఫిట్నెస్ తో బరిలోకి దిగుతున్నాడు. దానికి తగ్గట్టుగానే కేకేఆర్… మనీష్ పాండేను వాడుకుంటుంది. నిన్న ముంబై ఇండియన్స్ పై మ్యాచ్ గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్ లో సబిస్టిట్యూట్ ఫీల్డర్ గాని కనిపించిన మనీష్… నిన్న బ్యాటింగ్ చేసే ఛాన్స్ రావడంతో రెచ్చిపోయాడు. ఈ దెబ్బకు గెలిచిన కేకేఆర్… ప్లే ఆఫ్స్ ఛాన్సులు పెంచుకుంది.

Advertisement

Also Read: BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌, WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×