E-Paper
Advertisement

ప్రశాంత్ నీల్ బిగ్ సర్ప్రైజ్!.. ఎన్టీఆర్ ‘డ్రాగన్’ వెనుక అసలు రహస్యం ఏంటంటే?

ప్రశాంత్ నీల్ బిగ్ సర్ప్రైజ్!.. ఎన్టీఆర్ ‘డ్రాగన్’ వెనుక అసలు రహస్యం ఏంటంటే?
Advertisement

Dragon Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న ‘డ్రాగన్’ (Dragon) సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గ్లింప్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఇదొక పక్కా డార్క్ యాక్షన్ డ్రామా అని, ప్రశాంత్ నీల్ మార్క్ ఇంటెన్స్ యాక్షన్ తో నిండి ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. అయితే, తాజాగా ప్రముఖ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా అసలు కోర్ గురించి మాట్లాడుతూ ఎవరూ ఊహించని ఒక మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.

Read also-Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి టెన్షన్ పెట్టిన సుకన్య.. ఆస్తి కోసం ప్రతాప్ రచ్చ.. రామరాజు గుండెలు పగిలే సీన్..

Advertisement

ఈ సినిమా గ్లింప్స్ చూసి ఇదొక డార్క్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే పొరపాటేనని, తాము ఇప్పటివరకు భారతీయ తెరపై ఎవరూ చూడని ఒక అద్భుతమైన, అత్యున్నతమైన దేశభక్తి (Patriotic) చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నామని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఒక డార్క్ ఎన్విరాన్‌మెంట్‌లో దేశభక్తిని చూపించడం అనేది నిజంగానే ప్రేక్షకులు అస్సలు ఊహించని ఒక పెద్ద షాకింగ్ ఎలిమెంట్ అని చెప్పాలి.

ఈ సినిమా ప్రపంచం గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. కథ 1947 భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత ప్రారంభమై, 1967 కాలంలో సాగుతుందని తెలిపారు. బ్రిటిష్ వారు దేశాన్ని విడిచివెళ్లిన తర్వాత ముంబై, కోల్‌కతా వంటి నగరాల నేపథ్యంలో సాగిన నల్లమందు, హెరాయిన్ స్మగ్లింగ్ వ్యాపారాల చుట్టూ ఈ కథను అల్లినట్లు పేర్కొన్నారు. ఈ చీకటి సామ్రాజ్యంలో ఎన్టీఆర్ పాత్ర ‘లూగర్’ అనే ఒక పవర్‌ఫుల్ అసాసిన్ గా కనిపించబోతోంది. ఈ క్యారెక్టర్ తాను ఇప్పటివరకు రాసిన పాత్రలన్నింటిలోకి అత్యంత డార్క్ కోణం కలిగిన పాత్ర అని, దీనిని చేయడానికి ఎన్టీఆర్ చాలా రిస్క్‌తో కూడిన నిర్ణయం తీసుకున్నారని నీల్ కొనియాడారు.

Advertisement

ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టారనే చెప్పాలి. ఒక లీన్ అండ్ ఫిట్ అసాసిన్ లా కనిపించడం కోసం ఎన్టీఆర్ సుమారు 15 నుండి 16 కిలోల బరువు తగ్గారని, ఈ క్రమంలో ఆయన పడ్డ శ్రమను చూసి తనతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా కంగారు పడ్డారని ప్రశాంత్ నీల్ గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ ఒక ‘న్యూక్లియర్ ప్లాంట్’ లాంటివారని, సినిమా పట్ల, ముఖ్యంగా కథలోని డ్రామా పట్ల ఆయనకున్న విజన్ మరియు పట్టు అమోఘమైనవని ప్రశంసించారు. వీరిద్దరూ కలిసి దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు చర్చించి ఈ స్క్రిప్ట్‌ను ఎంతో పకడ్బందీగా సిద్ధం చేశారు.

Read also-Mega158 అప్డేట్.. మూవీ ప్రారంభోత్సవానికి హాజరైన డీసీఎం పవన్ కళ్యాణ్..

కె.జి.ఎఫ్, సలార్ చిత్రాల తర్వాత తన డార్క్ షేడ్ క్యారెక్టర్ల ట్రిలజీలో ‘డ్రాగన్’ చివరి చిత్రం కాబోతోందని, ఇకపై ఇటువంటి జోనర్‌ సినిమాలను తాను తాకబోనని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. గ్లింప్స్‌లో కనిపించే విజువల్స్, కలర్ ప్యాలెట్ డార్క్ గా ఉన్నప్పటికీ, అంతర్లీనంగా ఉండే ఎమోషన్ దేశభక్తి ప్రేక్షకులను ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఈ క్రేజీ అప్‌డేట్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 2027 జూన్ 11న విడుదల కాబోతున్న ఈ ‘దేశభక్తి’ యాక్షన్ అడ్వెంచర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×