Karate Kalyani Vs Anasuya: హీరోయిన్ల డ్రెస్సింగ్పై శివాజీ చేసిన కామెంట్స్ వివాదం రోజురోజుకి మరింత ముదురుతుంది. ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. చిన్మయి శ్రీపాద, నటి అనసూయల ఎంట్రీతో ఈ వివాదం మరింత రచ్చకెక్కింది. మరి ముఖ్యంగా ఈ వివాదంలో అనసూయ వరుస పోస్ట్స్, కామెంట్స్ చేస్తూ వస్తోంది. నిన్నటి శివాజీ కామెంట్స్ అనంతరం వీడియో షేర్ చేసిన అనసూయ.. ఈ రోజు ఉదయం వరుస పోస్ట్స్ చేసింది. తన వయసు ఉద్దేశిస్తూ ఆంటీ అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అలాగే ఆడవాళ్ల వస్త్రాధారణను తప్పుబడుతున్నవారంత.. దేవాలయాలపై ఉన్న విగ్రహలను దేవతలుగా చూస్తున్నప్పుడు బయట అమ్మాయిలను ఎందుకు తప్పుగా చూస్తున్నారని ప్రశ్నించింది. అయితే తాజాగా ఆమె పోస్ట్స్పై కరాటే కళ్యాణి స్పందించింది. బిగ్ టీవీకి తాజాగా ఆమె ఇంటర్య్వూ ఇచ్చింది. అనసూయ ఈ వివాదాన్ని చిలిచిలికి గాలివానగా చెస్తుందన్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఉండే అధికారం రాజ్యాంగమే ఇచ్చిందన్న అనసూయ కామెంట్స్కి ఆమె ఘాటు రిప్లై ఇచ్చింది. రాజ్యంగా కేవలం వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది తప్పా.. విచ్చలవిడిగా బట్టలు వేసుకోవచ్చని రాజ్యాంగం చెప్పలేదు కూడా. దేవాలయాల్లో బొమ్మలకు బట్టలు ఉండవు అంటుంది.. దేవాలయాల్లోని బొమ్మలకు ఖచ్చింతంగా చీరలు ఉంటాయి.
ఒకప్పుడు సినిమాల్లో ఉల్లిపోరలాంటి చీరలు వాడేవారు కానీ, నటీమణలు ఒంటినిండా బట్టలు వేసుకునేవారు. కాకపోతే.. వారి ఒంపుసొంపులు కనిపించేలా అలాంటి బట్టలు ఇస్తారు. అలాగే దేవాయాల్లోని బొమ్మలకు కూడా చీరలు ఉంటాయి. బట్టలు లేకుండ శిల్పి ఎలా చెక్కుతాడు. అజంత, ఎల్లోరా శిల్పం అంటూ శిల్పికి ఓ ద్రష్టి కోణం ఉంటుంది. అలా శిల్పాల ఒంపుసొంపులు కనిపించేలా చెక్కుతారు కానీ, చీరలు లేకుండ ఉండవు. బట్లలు లేకుండ కుచ్చులు అనేవి ఎందుకు ఉంటాయి. అవి రాయి కాబట్టి కనిపించవు. శిల్పాలకు చీరలు ఖచ్చితంగా ఉంటాయి” అని కరాటే కళ్యాణి కన్ఫాం చేశారు. అనంతరం అనసూయని ముర్ఖురాలిగా పేర్కొంది. శివాజీ వివాదంలోకి దేవుల్లను, దేవలయాల్లోని శిల్పాలను మధ్య తీసుకోవడం ముర్ఖుల లక్షణమన్నారు.
Also Read: Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2′ లో షారుఖ్ ఖాన్.. లీక్ ఇచ్చేసిన నటుడు!
వాళ్ల ప్రైవేట్ ఫంక్షన్లో ఎలా అయిన వేసుకోండి. పబ్లిక్ ఫంక్షన్లోకి వచ్చినప్పుడు కస్తా పద్దతిగా వేసుకోండని చెప్పడం తప్పా అని పేర్కొంది. దీనికి దేవాలయాల్లోని బొమ్మలకి కనెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. నా డ్రెస్ నా ఇష్టం అన్నప్పుడు.. నా చూపు నా ఇష్టం.. అని వాళ్లు అంటే ఏం చేస్తారు. మేము ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాం.. వాళ్లు చూడొద్దని అంటారు. ఒళ్లంత కనిపించేలా బట్టలు వేసుకున్నప్పుడు.. అబ్బాయిలు కూడా చూస్తారు. మా చూపు మా ఇష్టం అంటారు అప్పుడు నువ్వు ఏం చేయగలవు అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు 30 వయసు దాటివారిని కూడా ఆంటీ అంటున్నారు. నువ్వు 40 దగ్గర్లో ఉన్నప్పుడు ఆంటీ అనరా? ఇంకా నువ్వు స్వీట్ సీక్సిటినా? అని వెటకరించింది. ఇద్దరు పిల్లలు ఉన్న నువ్వు ఆంటి కాదా? ఆంటీ అంటే ఎందుకు ఒప్పుకోవడం లేదంటూ అనసూయకు కళ్యాణ్ గట్టి చురకలు అట్టించింది.