Shah Rukh Khan in Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఆయన ఏ సినిమా చేసిన అది నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. రజనీ 173వ చిత్రంపై బజ్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. ఇంకా స్క్రిప్ట్ లేదు, ఈ మూవీ డైరెక్టర్ కూడా ఫిక్స్ కాలేదు. కానీ, కమల్-రజనీ కాంబో అనగానే దేశవ్యాప్తంగా ఈ మూవీపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. రజనీ ప్రస్తావన వస్తే చాలు ఈ మూవీ గురించి ఆరా తీస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా రజనీతో బాలీవుడ్ బాద్షా జతకట్టబోతున్నాడట.
దీనిపై తాజాగా ఓ అగ్ర నటుడు లీక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ అంశం బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా హాట్ హాపిక్ అవుతుంది. ఇంతకి అసలు సంగతేంటంటే.. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 మూవీతో చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. జైలర్ 1 ఏ రేంజ్లో విజయం సాధించిందో తెలిసిందే. దీనికి సీక్వెల్గా వస్తున్న జైలర్ 2ని నెల్సన్ అంతకుమించి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఇతర భాషలకు చెందిన స్టార్స్ కూడా భాగం కానున్నారని మొదటి నుంచి టాక్ వినిపిస్తుంది. కానీ, ఇప్పటి వరకు జైలర్ 2 కాస్ట్ని మాత్రం నెల్సన్ రివీల్ చేయలేదు.
ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎవరనేది ఇటూ ఇండస్ట్రీ వర్గాల్లో, అటూ అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. అయితే జైలర్ 2 బాలీవుడ్ అగ్ర నటుడు మిథున్ చక్రవర్తి నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈ సినిమాలో ఓ స్టార్ కాస్ట్‌పై లీక్ ఇచ్చారు. ఇటీవల ఓ బెంగాళీ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తను నటిస్తోన్న ‘జైలర్ 2′ మూవీ గురించి చెప్పారు. అదే క్యూరియాసిటీలో ఈ సినిమా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కూడా నటిస్తున్నట్టు నోరు జారారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా కాస్టింగ్ వివరాలను మూవీ టీం అధికారికంగా వెల్లడించలేదు. ఇక ఇప్పుడు షారుక్ జైలర్ 2 నటిస్తున్నాడంటూ మిథున్ చక్రవర్తి లీక్ ఇవ్వడంతో ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
Also Read: Prabhas: సందీప్ రెడ్డి వంగా బర్త్డే.. ప్రభాస్ ఆసక్తికర పోస్ట్!
ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే స్క్రీన్పై కనిపించడమంటే అభిమానులకు అదోక వేడుక. ఇప్పుడు రజనీకాంత్- షారూఖ్ ఖాన్ కాంబినేషన్ జైలర్ 2లో కనిపిస్తుందని తెలిసి ఆడియన్స్ ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. వీరిద్దరి కలయిత జైలర్ 2కి మరింత స్పెషల్ అవుతుందనడంలో సందేహం లేదు. కాగా ఈ ఇంటర్య్వూలో ఇటీవలి కాలంలో మీకు నచ్చిన సినిమా ఏదని ప్రశ్నించగా.. మిథున్ మాట్లాడుతూ.. ‘జైలర్ 2‘ కథ అని చెప్పారు. ఈ మూవీ స్క్రిప్ట్ తనని బాగా ఆకర్షించిందన్నారు. అదే సమయంలో నటీనటుల వివరాల గురించి చెబుతూ.. మోహన్‌లాల్, షారుఖ్ ఖాన్, రమ్యకృష్ణన్, శివరాజ్‌కుమార్ తదితరులు ఇందులో నటిస్తున్నారంటూ.. షారుక్ లీక్ ఇచ్చేసాడు. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ పేరును అతడు లీక్ చేయడంతో ఇప్పుడిది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.