E-Paper
Advertisement

Interview Mistakes: రిజెక్షన్ నుంచి సెలక్షన్ వరకు.. ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే ఉద్యోగం మీదే !

Interview Mistakes: రిజెక్షన్ నుంచి సెలక్షన్ వరకు.. ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే ఉద్యోగం మీదే !
Advertisement

Interview Mistakes: ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు మనం రెడీ అవడం కోసం ఎంతో శ్రద్ధ వహిస్తాం. అంతే కాకుండా ఇంటర్వ్యూ కోసం కూడా ప్రిపేర్ అవుతాం. కానీ కొన్ని సార్లు మనకు తెలియ కుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ఉద్యోగ అవకాశాన్ని దెబ్బతీస్తాయి. బాడీ లాంగ్వేజ్ నుంచి మాట్లాడే విధానం వరకు, మనం తరచుగా చేసే 10 ముఖ్యమైన పొరపాట్లు, వాటిని ఎలా అధిగమించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఇంటర్వ్యూ సమయంలో ఇలాంటి పొరపాట్లు చేయొద్దు: 

1. కంపెనీ గురించి అవగాహన లేకపోవడం:

Advertisement

చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఇది. కంపెనీ ఏం చేస్తుంది? వారి లక్ష్యాలు ఏంటి? అనే ప్రాథమిక విషయాలు తెలియకుండా ఇంటర్వ్యూకి వెళ్లడం వల్ల మీకు ఆ ఉద్యోగంపై ఆసక్తి లేదని ఇంటర్వ్యూ చేసే వారు భావిస్తారు.

2. బాడీ లాంగ్వేజ్ :

మీరు మాట్లాడే మాటల కంటే మీ శరీరం ఇచ్చే సంకేతాలు ముఖ్యం. భుజాలు వాల్చి కూర్చోవడం, చేతులు కట్టుకోవడం లేదా కళ్ళలోకి చూడకుండా మాట్లాడటం (ఐ కాంటాక్ట్ లేకపోవడం) మీ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందని సూచిస్తాయి.

3. పాత కంపెనీ గురించి ఫిర్యాదు:

మీ పాత కంపెనీ లేదా బాస్ గురించి చెడుగా మాట్లాడటం ప్రొఫెషనలిజం అనిపించుకోదు. ఇది మీరు భవిష్యత్తులో ఈ కంపెనీ గురించి కూడా ఇలాగే మాట్లాడతారేమో అన్న నెగటివ్ ఇంప్రెషన్ కలిగిస్తుంది.

4. వినకుండానే సమాధానం చెప్పడం:

ప్రశ్న పూర్తిగా వినకుండానే లేదా అర్థం చేసుకోకుండానే సమాధానం చెప్పడం వల్ల తప్పులు దొర్లే అవకాశం ఉంది. ప్రశ్న విన్న తర్వాత ఒకటి రెండు సెకన్ల విరామం తీసుకుని స్పష్టంగా సమాధానం చెప్పండి.

5. “అవును”, “కాదు” అనే సమాధానం:

క్లోజ్డ్-ఎండెడ్ సమాధానాలు సంభాషణను ఆపేస్తాయి. ప్రతి సమాధానాన్ని ఒక ఉదాహరణతో లేదా మీ అనుభవంతో వివరించడానికి ప్రయత్నించండి. దీని వల్ల మీ నైపుణ్యాలు ఇంటర్వ్యూయర్‌కు బాగా అర్థమవుతాయి.

6. డ్రెస్ కోడ్ పాటించకపోవడం:

“ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్”. ఉద్యోగానికి తగ్గట్టుగా ప్రొఫెషనల్ దుస్తులు ధరించకపోవడం మిమ్మల్ని అనర్హులుగా చూపించవచ్చు. ఆఫీస్ కల్చర్‌కు తగినట్లుగా సిద్ధమవ్వడం ముఖ్యం.

7. అతిగా మాట్లాడటం:

అడిగిన ప్రశ్నలకు సంబంధం లేని విషయాలు చెప్పడం.. మీ వ్యక్తిగత సమస్యలను చర్చించడం వల్ల సమయం వృథా అవుతుంది. ప్రొఫెషనల్ పరిధిలోనే మీ సంభాషణ ఉండేలా చూసుకోండి.

8. జీతం గురించి ముందే చర్చించడం:

ఇంటర్వ్యూ ప్రారంభంలోనే.. శాలరీ ఎంత అని అడగడం నెగటివ్ ఇంప్రెషన్ ఇస్తుంది. ముందు మీ నైపుణ్యాలను నిరూపించుకోండి. కంపెనీ మిమ్మల్ని ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నాక జీతం గురించి మాట్లాడటం సరైన పద్ధతి.

Also Read: కొరియన్ల లాగా స్లిమ్‌గా మారాలా ? బెల్లీ ఫ్యాట్ తగ్గించే 7 అద్భుతమైన మార్గాలు

9. ఫోన్ సైలెంట్‌లో పెట్టకపోవడం:

ఇంటర్వ్యూ మధ్యలో ఫోన్ రింగ్ అవ్వడం లేదా నోటిఫికేషన్లు రావడం చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇది మీరు ఇంటర్వ్యూపై సీరియస్‌గా లేరని సూచిస్తుంది. లోపలికి వెళ్లే ముందే ఫోన్‌ను ‘స్విచ్ ఆఫ్’ లేదా ‘సైలెంట్’ మోడ్‌లో ఉంచండి.

10. ప్రశ్నలు అడగకపోవడం:

ఇంటర్వ్యూ చివరలో “మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?” అని అడిగినప్పుడు “ఏమీ లేవు” అని చెప్పడం ఒక తప్పు. కంపెనీ కల్చర్ గురించి లేదా మీ రోల్ గురించి కనీసం రెండు ప్రశ్నలైనా అడగండి. ఇది మీ ఉత్సాహాన్ని తెలియజేస్తుంది.

ఇంటర్వ్యూ అనేది మీ నైపుణ్యాలను ప్రదర్శించే వేదిక. పైన పేర్కొన్న చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా మీరు ఇతరుల కంటే మెరుగ్గా రాణించవచ్చు. ప్రశాంతంగా.. ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పడం చాలా ముఖ్యం.

Related News

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

Big Stories

Advertisement
×