E-Paper
Advertisement

Annagaru Vostaru: కార్తీ ‘ అన్నగారు వస్తారు’ కు లైన్ క్లియర్… కొత్త రిలీజ్ డేట్ ఇదే?

Annagaru Vostaru: కార్తీ ‘ అన్నగారు వస్తారు’ కు లైన్ క్లియర్… కొత్త రిలీజ్ డేట్ ఇదే?
Advertisement

Annagaru Vostaru: ఇటీవల కాలంలో సినిమాల విడుదల తేదీలు ఉన్నఫలంగా వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఇటివరకు నిర్మాతలకు ఫైనాన్స్ సమస్యల కారణంగా సినిమాలు చివరి నిమిషంలో వాయిదా పడుతున్నాయి. బాలకృష్ణ హీరోగా నటించిన ఆఖండ 2 సినిమా ఇలాంటి ఇబ్బందుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాటలోనే కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ(Karthi) అన్నగారు వస్తారు(Annagaru Vostaru) సినిమా కూడా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఉన్న ఫైనాన్స్ సమస్యల కారణంగా సినిమా విడుదలను అడ్డుకున్న సంగతి తెలిసిందే.

డిసెంబర్ 24న అన్నగారు వస్తారు..

ఈ క్రమంలోనే నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమాకు ఎదురైన ఫైనాన్స్ ఇబ్బందులన్నింటినీ క్లియర్ చేశారని తెలుస్తోంది .ఈ క్రమంలోనే ఈ సినిమా కొత్త విడుదల తేదీని ఖరారు చేసినట్టు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం అన్నగారు వస్తారు. సినిమాని డిసెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఊహించని విధంగా మధ్యాహ్నం విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ విడుదల కావాల్సి ఉండగా అప్పుడు వాయిదా పడుతూ డిసెంబర్ 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.

అమెజాన్ ఒప్పందం ప్రకారమే..

Advertisement

ఇక ఈ సినిమా చివరి నిమిషంలో విడుదలను అడ్డుకుంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వాయిదా పడింది. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించిన ఈ కొత్త తేదీని అధికారకంగా వెల్లడించబోతున్నారు. ఈ సినిమా ఓటిటి డీల్ ప్రకారం డిసెంబర్లో విడుదల కాకపోతే అమెజాన్ ప్రైమ్ తమ ఒప్పందం క్యాన్సిల్ చేసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిసెంబర్ 24వ తేదీని విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తమిళంలో వా వాతియార్ పేరిట విడుదల కాగా, తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్ తో విడుదల కాబోతుంది.

కార్తీకు జోడిగా కృతి శెట్టి…

Advertisement

ఈ సినిమాలో కార్తీ డిఎస్పీ గా కనిపించనున్నారు. కార్తీకు జోడిగా కృతి శెట్టి(Krithi Shetty) సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈమెకు ఇది మొదటి తమిళ సినిమా కావటం విశేషం. ఇదివరకు తెలుగు సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి శెట్టికి ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన సక్సెస్ సినిమాలు లేవని చెప్పాలి. ఈ నేపథ్యంలోని కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక కార్తీ పేరుకే తమిళ హీరో అయినప్పటికీ ఈయనకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కార్తీ సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది.

Also Read; Suriya -venky Atluri: షూటింగ్ పూర్తి చేసుకున్న సూర్య అట్లూరి సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా?

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×