HUAWEI Mate X7: హువావే తాజాగా Mate X7 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను చైనా తర్వాత గ్లోబల్ మార్కెట్‌లో కూడా అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక Kirin 9030 Pro చిప్‌సెట్, ప్రీమియం OLED డిస్‌ప్లేలు, శక్తివంతమైన కెమెరాలు వంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. ప్రత్యేక ఫీచర్ల ద్వారా హువావే Mate X7 ప్రీమియం యూజర్స్ కోసం రూపొందించిన ఫోల్డబుల్ ఫోన్‌గా నిలిచింది.
Mate X7 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను చైనా తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లోకి దించింది. పుస్తకం తరహా డిజైన్‌తో రూపొందించిన ఈ ఫోన్‌ను ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అధునాతన టెక్నాలజీతో రూపొందించిన శక్తివంతమైన ప్రాసెసర్, హై క్వాలిటీ డ్యూయల్ OLED డిస్‌ప్లేలు ఈ డివైస్‌కు ఫ్లాగ్‌షిప్ స్థాయి అనుభూతిని అందిస్తున్నాయి. ఆధునిక ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో ఉండాల్సిన అన్ని కీలక ఫీచర్లు Mate X7 ఫోన్‌లో ఉన్నాయి.
Also Read: కృత్రిమ స్నేహాలు ప్రమాదకరమా? ఈ 5 తప్పులు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు!
Mate X7లో రెండు OLED స్క్రీన్లు ఉన్నాయి. లోపలి స్క్రీన్ 8 అంగుళాల ఫ్లెక్సిబుల్ LTPO OLED 2210 x 2416 పిక్సెల్స్‌గా ఉండగా.. బయట 6.49 అంగుళాల 3D క్వాడ్-కర్డ్వ్ LTPO OLED 1080 x 2444 పిక్సెల్స్ డిస్‌ప్లే కలిగి ఉంది. రెండు స్క్రీన్లు 1Hz నుండి 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇన్‌సైడ్ టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz ఉండగా.. అవుట్‌సైడ్ 300Hz ఉంది. బయట స్క్రీన్‌పై రెండో తరం Kunlun గ్లాస్ రక్షణను కూడా అందించారు.
ఈ ఫోన్‌లో Kirin 9030 Pro చిప్‌సెట్‌ను అమర్చారు. దీంతో 16GB RAM, 512GB స్టోరేజ్ ఉండనుంది. ఇక ఆపరేటింగ్ కోసం HarmonyOS 6.0ను ఆధారంగా తీసుకున్నారు. ఇది ప్రీమియం యూజర్ ఎక్స్‌పీరియెన్స్ కోసం రూపొందించబడింది.
ఇకపోతే.. Mate X7 వెనుక భాగంలో 50MP RYYB ప్రైమరీ కెమెరా, 40MP అల్ట్రా వైడ్ RYYB కెమెరా, 50MP టెలిఫోటో RYYB కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. లోపల, అవుట్‌సైడ్ స్క్రీన్లలో 8MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. రెండు సెన్సర్లలో Red Maple సెన్సర్ కూడా ఉంది. ఇది ఫోటో నాణ్యతను మరింత మెరుగుపరుస్తుంది. అలాగే Mate X7కి IP58 + IP59 రేటింగ్ ఉంది. అలాగే నీరు, మరియు దుమ్ము నిరోధకతలో మంచి రక్షణను ఇస్తుంది. కనెక్టివిటీ కోసం Wi-Fi, Bluetooth 6, NFC, USB Type-C, మరియు NavIC, BeiDou, Galileo, GPS వంటి నావిగేషన్ సపోర్ట్ ఉంది.
5300mAh బ్యాటరీ సామర్థ్యం కలిగిన Mate X7లో ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 66W వైర్డ్, 50W వైర్‌లెస్ సపోర్ట్ కూడా ఉంది. ఇకపోతే యూరప్‌లో ఈ ఫోన్ 16GB RAM + 512GB స్టోరేజ్ వెర్షన్ రూ.2,20,000కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్రోకేడ్ వైట్, నెబులా రెడ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీని ప్రీమియం ఫీచర్స్, శక్తివంతమైన ప్రాసెసర్, రెండు ప్రీమియం OLED డిస్‌ప్లేలు కలిగి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచింది.
Also Read: పోకో అభిమానులకు గుడ్ న్యూస్.. 6.9 అంగుళాల డిస్‌ప్లేతో C85 5G ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది!