E-Paper
Advertisement

Road Accident: ట్రావెల్ బస్సుకి బ్రేక్ ఫెయిల్.. డివైడర్‌‌ని ఢీ కొట్టి, స్పాట్‌లో 40 భవానీలు

Road Accident: ట్రావెల్ బస్సుకి బ్రేక్ ఫెయిల్.. డివైడర్‌‌ని ఢీ కొట్టి, స్పాట్‌లో 40 భవానీలు
Advertisement

Road Accident: ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకు రకరకాల కారణాలు లేకపోలేదు. సరిగ్గా సోమవారం అలాంటి ఘటన ఒకటి ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ట్రావెల్ బస్సు నేరుగా డివైడర్ ని ఢీ కొట్టింది. అసలేం జరిగింది?

ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు

Advertisement

2024 ఏడాదిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దారుణమైన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ప్రభుత్వం, ప్రైవేటు బస్సు ప్రమాదాల్లో చాలామంది చనిపోయారు. ముఖ్యంగా ఏపీలోని కర్నూలు- తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 19 చొప్పున మృత్యువాతపడ్డారు.

ఆ ఘటన నుంచి ఇప్పుడిప్పుడు ప్రజలు తేరుకుంటున్నారు. అయినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రకాశం జిల్లా దోర్నాల ఘాట్ వద్ద ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న బస్సు.. దొర్నాల ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ అయ్యింది. ఆ వేగాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు డ్రైవర్.

Advertisement

ప్రకాశం జిల్లాలో ఘటన.. డివైడర్‌ని ఢీకొట్టిన బస్సు

దీంతో బస్సు డివైడర్‌ని బలంగా ఢీ కొట్టింది. చిన్నదైతే లోయలోకి బస్సుపోయేది. డివైడర్‌కి మధ్యలో ఉంది. ఘటన సమయంలో బస్సులో 40 మంది భవానీలు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

డ్రైవర్ వైపు కిటికీల నుంచి స్వాములు మెల్లా బయటపడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటన గురించి వివరాలు ఆరా తీశారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు స్వాములు. తమను ఏ దేవుడో కాపాడాడని చెబుతున్నారు.

ALSO READ:  అడ్డంగా బుక్కైన ఓ యువకుడు.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ పోస్టు

అసలే చలికాలం.. దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అంటూ పదే పదే హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×