Sardar 2 Karthi:ఇటీవల కాలంలో శివాజీ మొదలుకొని మరి కొంతమంది సెలబ్రిటీలు హీరోయిన్ల వస్త్రధారణ గురించి బహిరంగ ప్రదేశాలలో కామెంట్లు చేసి ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శివాజీ చేసిన కామెంట్లు ఏకంగా మహిళా కమిషన్ వరకు వెళ్లడం , ఆమె స్పందించడం, శివాజీ క్షమాపణలు చెప్పడం అన్నీ జరిగిపోయాయి. ఇంత తతంగం జరిగినా కూడా మళ్లీ కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi )తనకేమీ తెలియదు అన్నట్టు.. స్టార్ హీరోయిన్ వస్త్రధారణ పై చేసిన కామెంట్లు మళ్లీ వివాదానికి తెరలేపాయి. స్టార్ హీరో కార్తీ తెలిసి చేశారా? లేక తెలియక కామెంట్లు చేశారా ? లేదా ? తెలిసి తెలియక సరదాగా ఆ మాటలు అన్నారా? అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో గతంలో తెరకెక్కిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’.. మంచి విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ కూడా మేకర్స్ ప్రకటించారు. సినిమా సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ..” సర్దార్ 2 లో మాళవిక మోహనన్ (Malavika mohanan) ను హీరోయిన్గా ఎంపిక చేసిన సమయంలో చిత్ర బృందంతో సరదాగా జరిగిన సంభాషణను ఆయన గుర్తు చేసుకున్నారు. సినిమాలో హీరోయిన్ మాళవిక మోహనన్ ను ఎంపిక చేసామని నాతో చెప్పడంతో.. “హాలీవుడ్ నటి మోనికా బెల్లూచి తరహాలో మాళవికకి కూడా ఈ సినిమాలో గ్లామర్ దుస్తులు ఉంటాయా?” అని నేను దర్శక నిర్మాతలను అడిగాను.
అయితే నేను ఈ ప్రశ్నను నా వ్యక్తిగత ఆనందం కోసం అడగలేదు. ప్రేక్షకులకు తెరపై వినోదం అందించాలనే ఉద్దేశంతోనే సరదాగా అడిగాను అంటూ కార్తీ నవ్వుతూ తెలిపారు.. అయితే కార్తీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన దృష్టిలో సరదాగా సాగిన సోషల్ మీడియాలో మాత్రం దీనిపై నెటిజన్స్ నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తం అవుతున్నాయి.
ALSO READ:వారణాసి చిత్రంపై అదిరిపోయే న్యూస్.. బుల్ ఫైట్ షూటింగ్ ఎప్పుడంటే?
విడుదలైన ప్రచార చిత్రాలలో ఆమె పాత్రను చూసిన నెటిజన్స్ కార్తీ చేసిన మాటలకు.. సర్దార్ 2లో మాళవిక కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాలేదు.. ఆమె ఒక స్పై పాత్రలో యాక్షన్ తో కూడిన కీలకమైన క్యారెక్టర్ పోషిస్తుంది అంటూ గుర్తు చేస్తున్నారు. అలాంటి పాత్రలో నటిస్తున్న హీరోయిన్ గురించి దుస్తులు, గ్లామర్ కోణంలో మాట్లాడడం కంటే.. ఆమె యాక్షన్ పర్ఫామెన్స్ పాత్ర గురించి మాట్లాడుంటే మీ విలువ కూడా పెరిగేదేమో అంటూ నెటిజన్స్ కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి అయితే మాళవిక మోహనన్ వస్త్రధారణ గురించి, ఆమె గ్లామర్ గురించి చేసిన కామెంట్లు కార్తీని ఇబ్బందుల్లో పడేసాయని చెప్పాలి.
మరొకవైపు కార్తీ ని సపోర్ట్ చేస్తున్న వారు కూడా లేకపోలేదు. ఆయన వాటిని సరదాగా చెప్పారని ,దీనిని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అంటూ కార్తీకి సపోర్ట్ పలుకుతున్నారు. ఏది ఏదైనా పబ్లిక్ ఈవెంట్లలో సహనటుల గురించి మాట్లాడేటప్పుడు మాటలు నోరు జారడం కంటే పొదుపుగా మాట్లాడడం అవసరం అని సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా వస్త్రధారణ వివాదం మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పవచ్చు.