E-Paper
Advertisement

వారణాసి చిత్రంపై అదిరిపోయే న్యూస్.. బుల్ ఫైట్ షూటింగ్ ఎప్పుడంటే?

వారణాసి చిత్రంపై అదిరిపోయే న్యూస్.. బుల్ ఫైట్ షూటింగ్ ఎప్పుడంటే?
Advertisement

Varanasi: చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. హీరోగా టాలీవుడ్ లో పదుల సంఖ్యలో సినిమాలు చేసి, భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మహేష్ బాబు (Maheshbabu ) తొలిసారి పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్ గా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ కావడంతో అటు అంతర్జాతీయంగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

వారణాసి పై గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..

ముఖ్యంగా సినిమా నుండి వస్తున్న అప్డేట్స్ కూడా సినిమాపై ఊహించని బజ్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పాలి. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా షూటింగ్ అప్డేట్ కు సంబంధించిన ఒక వార్త గూస్ బంప్స్ తెప్పిస్తోంది. వారణాసిలో మహేష్ బాబు పై ఒక భారీ బుల్ ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో అత్యంత కీలకంగా ఉండనుంది అని కూడా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ లో మహేష్ బాబు పాత్రకు సంబంధించి పవర్ఫుల్ ఎలివేషన్లు, బుల్ ఫైట్ కు సంబంధించిన విజువల్ కనిపించడంతో తాజాగా వినిపిస్తున్న ఈ వార్త సినిమాపై మరింత అంచనాలను పెంచేసిందని చెప్పవచ్చు.

బుల్ ఫైట్ సీన్..

Advertisement

ఇకపోతే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వైరల్ న్యూస్ ప్రకారం.. హైదరాబాద్ శివారులలో వచ్చేవారం ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ను నిర్వహించడానికి చిత్ర బృందం సిద్ధమవుతుందట. ఈ బుల్ ఫైట్ ను రాజమౌళి భారీ స్థాయిలో హై క్వాలిటీ విజువల్స్ తెరకెక్కించడానికి ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ వారణాసి మూవీని 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. పలు ప్రాంతాలు, కాలాల నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి ,ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీని అందించారు..

ALSO READ:మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం..

Advertisement

ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారుగా రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రం.. వారణాసి నగరం ఒక గ్రహ శకలం రాకను ఎదుర్కొంటున్న సమయంలో.. రుద్ర సాహసాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. క్లాసిక్ అడ్వెంచర్ సినిమాల నిర్మాణం, భావోద్వేగాల శైలి నుండి ప్రేరణ పొంది భారతీయ సాంస్కృతిక ఇతివృత్తాలతో పాతుకుపోయిన ఒక ప్రపంచయాత్రా సాహస చిత్రంగా రాజమౌళి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ మొదలుకొని కెన్యా, ఒడిస్సా, అంటార్కిటికా వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమా షూటింగ్ జరిగింది. అంతేకాదు అంటార్కిటికా లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రంగా కూడా వారణాసి రికార్డు సృష్టించింది.

Related News

శ్రీలీల చిన్నప్పటి ‘భరతనాట్యం’ వీడియో చూశారా? ఏం టాలెంట్ గురూ!

చిక్కుల్లో పడ్డ హీరో కార్తీ.. స్టార్ హీరోయిన్ వస్త్రధారణపై కామెంట్స్!

ప్రభుదేవా ‘మూన్ వాక్ ‘ రిలీజ్ డేట్ లాక్.. టైం చూసి దిగుతున్నాడే..!

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

Big Stories

Advertisement
×